పవన్ కళ్యాణ్ - తేజ కాంబినేషన్లో సెట్టయిన సినిమా.. ఎందుకు ఆగిపోయిందంటే?

తెలుగు చిత్ర పరిశ్రమంలో ఒకప్పుడు మంచి దర్శకుడుగా గుర్తింపు అందుకున్న వారిలో తేజ కూడా ఉన్నారు. చాలా కష్టపడి ఇండస్ట్రీలో తనకు ప్రత్యేకమైన స్థానాన్ని అందుకున్నారు. దర్శకుడు తేజ మొదట ఎక్కువగా ప్రేమ కథలతో మంచి క్రేజ్ అందుకున్నాడు. చిత్రం సినిమాతో మొదలైన తేజ ఇప్పుడు అహింస వరకు తనకు నచ్చిన డిఫరెంట్ కంటెంట్ ను వెంటనే చూపిస్తూ వచ్చాడు. ఇక తేజ ఇండస్ట్రీకి పరిచయం చేసిన నటీనటుల లిస్టు కూడా పెద్దగానే ఉంటుంది.

అయితే తేజ కొత్త వారితో మాత్రమే కాకుండా మధ్యలో కొంతమంది స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేసేందుకు ఆసక్తిని చూపించారు. జయం సినిమా తర్వాత తేజ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. మహేష్ బాబు ఒక్కడు సినిమాతో సక్సెస్ అందుకున్న తరువాత తేజ దర్శకత్వంలో నిజం అనే సినిమాను చేశాడు. ఇక ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.

Director teja clarification on pawan kalyan project cancellation

ఇక అదే సమయంలో తేజ పవన్ కళ్యాణ్ తో కూడా ఒక సినిమా చేయాలని అనుకున్నారు. దర్శకుడు తేజ పవన్ క్రేజ్ ను దృష్టిలో ఉంచుకొని ఒక పవర్ఫుల్ కథను కూడా సిద్ధం చేశాడట. అయితే అందులో వైలెన్స్ మరింత ఎక్కువగా ఉందని పవన్ అభ్యంతరం చెప్పారట. ఇక ఆ తరువాత కొన్ని చర్చలు జరిగినా కూడా కాంబినేషన్ సెట్ కాలేదు.

కానీ ఆ కథ మళ్ళీ ఎవరితో చేయాలని అనిపించలేదు అని తేజ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఇక పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి మాట్లాడుతూ ఇటీవల వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టీజర్ చూశాను అంటూ అది అద్భుతంగా ఉందని తప్పకుండా సినిమా సక్సెస్ అవుతుంది అని అన్నారు. అలాగే పవన్ తో చేస్తే అలాంటి సినిమా చేయాలి అని అన్నారు. ఇక తేజ దర్శకత్వంలో తెరకెక్కిన అహింస సినిమా జూన్ 2వ తేదీన విడుదల అవుతోంది. ఈ సినిమా ద్వారా దగ్గుబాటి అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X