'చిత్రం' సీక్వెల్.. మళ్ళీ కొత్త వాళ్లపైనే ఫోకస్ పెట్టిన దర్శకుడు.. గేట్ రెడీ!
2000వ సంవత్సరంలో ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. తేజ డైరెక్షన్ లో వచ్చిన మొదట సినిమా అది. ఈ సినిమా ద్వారానే తెలుగు ప్రేక్షకులకు ఒక మంచి హీరోగా ఉదయ్ కిరణ్ అలాగే హీరోయిన్ రిమాసేన్ పరిచయమయ్యారు. తేజ ఆడిషన్స్ నిర్వహించి ఒక్కొక్కరికి సెలెక్ట్ చేసుకున్నారు.
ఇక 20 ఏళ్ళ తరువాత ఆ హిట్టు సినిమాకు సీక్వెల్ గా చిత్రం 1.1 ను తెరకెక్కిస్తున్నారు. ఇటీవల తేజ పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. 20ఏళ్ళ క్రితం అందమైన లవ్ స్టోరీతో బాక్సాఫీస్ హిట్ కొట్టి ట్రెండ్ సెట్ చేసిన తేజ ఈ సినిమాతో మళ్ళీ హిట్టు కొట్టి ఫామ్ లోకి రావాలని అనుకుంటున్నాడు.

ఇక 20 ఏళ్ల క్రితం సినిమాను ఎలా మొదలు పెట్టారో ఇప్పుడు కూడా అలానే స్టార్ట్ చేస్తున్నారు. పూర్తిగా కొత్త వాళ్లనే సెలెక్ట్ చేసుకుంటున్నట్లు చెబుతూ ఆడిషన్స్ కూడా నిర్వహించడానికి సిద్ధమయ్యారు. త్వరలోనే అందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుపనున్నట్లు సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. మరి ఈ సినిమాతో తేజ మళ్ళీ బాక్సాఫీస్ వద్ద హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











