రానా, గోపిచంద్‌లతో తేజ.. టెటిల్స్ రిజిష్టర్ చేయించిన డైరెక్టర్
టాలీవుడ్ విలక్షణ దర్శకుడు తేజ.. చేసిన ప్రతీ సినిమాలో తన మార్క్ కనబడుతుంది. ఒక్క ఫ్రేమ్‌ను చూసి అది తేజ సినిమా అని ఇట్టే గుర్తు పట్టేయవచచు. అంతటి విభిన్నమైన శైలి అతని సొంతం. కెరీర్‌లో బ్లాక్ బస్టర్ హిట్స్‌తో పాటు.. డిజాస్టర్లను కూడా చూశాడు. అయితే ఎన్నడు కూడా వెనక్కితగ్గలేదు. తనశైలిలోనే చిత్రాలు తెరెక్కిస్తు వస్తున్నాడు. చివరగా కాజల్ అగర్వాల్, బెల్లంకొండ శ్రీనివాస్ కాంబోలో సీత అనే చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు.
రానా-కాజల్ జంటగా వచ్చిన నేనే రాజు నేనే మంత్రి హిట్ అవ్వడంతో.. సీత ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాడు తేజ. అయితే ఈ చిత్రం ఆశించనమేర విజయం సాధించలేకపోయింది. ఈ సినిమా వచ్చి చాలా నెలలు అవుతున్నా..మరో ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించలేదు. అయితే నేడు తేజ పుట్టినరోజు సందర్భంగా రెండు టైటిల్స్‌ను రిజిష్టర్ చేయించారు.

రాక్షసరాజు రావణాసురుడు, అలివేలుమంగ వెంకటరమణ అనే ఈ రెండు టైటిల్స్ డైరెక్టర్ తేజ రిజిష్టర్ చేయించాడు. గతకొన్ని రోజులుగా వినిపిస్తున్న వార్తల ప్రకారం రానాతో రాక్షసరాజు రావణాసురుడు, గోపిచంద్‌తో అలివేలుమంగ వెంకటరమణ అనే చిత్రాలను చేయనున్నట్లు తెలుస్తోంది. మరి వీటికి సంబంధించిన మిగతా వివరాలను ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











