నీ తాత పేరు చెప్పుకొంటే లాభం లేదు.. ఆ హీరోకు టార్చర్ పెట్టి ఏడ్పించిన డైరెక్టర్ తేజ

దర్శకుడు తేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెమెరామెన్‌గా కెరీర్ ప్రారంభించి.. అసిస్టెంట్ డైరెక్టర్‌గా, దర్శకుడిగా మారారు. తెలుగు ఇండస్ట్రీకి వెరైటీ కథలను, లవ్‌స్టోరీస్‌ను అందించారు. పర్ఫెక్షన్ విషయం రాజీపడరని తేజకు పేరు. గురువు రామ్ గోపాల్ వర్మ లాగే.. విభిన్నమైన మనస్తత్వంతో ఆకట్టుకున్నారు. ఇటీవలి కాలంలో జోరు తగ్గించినప్పటికీ సరైన హిట్ పడితే ఆయన రేంజ్ మారిపోతుందని విశ్లేషకులు చెబుతారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఓ స్టార్ హీరోను తాను టార్చర్ చేసినట్లు చెప్పి షాకిచ్చారు తేజ. ఆ హీరో ఎవరు? ఇంతకీ ఏం జరిగింది? ఈ వివరాల్లోకి వెళితే..

కెమెరామెన్ నుంచి డైరెక్టర్‌గా
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన రాత్రి మూవీకి సినిమాటోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించిన తేజ.. ఆ తర్వాత మనీ, రక్షణ, తీర్పు సహా పలు తెలుగు, హిందీ చిత్రాలకు కెమెరామెన్‌గా పనిచేశారు. అనంతరం దర్శకుడిగా మారి.. చిత్రం, ఫ్యామిలీ సర్కస్, నువ్వు నేను, జయం, నిజం, సంబరం, జై, ధైర్యం, ఔనన్నా కాదన్నా, ఒక విచిత్రం, లక్ష్మీ కళ్యాణం, నేనే రాజు నేనే మంత్రి, సీత, అహింస తదితర సినిమాలకు దర్శకత్వం వహించారు. అహింస తర్వాత కొత్తగా ఏ సినిమాకు తేజ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కొద్దినెలల క్రితం మ్యాచో స్టార్ గోపీచంద్‌ను సరదాగా తేజ ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు తేజ.

Director Teja Reveals How He Tortured a Star Hero for Perfection

మీ తాత సరే.. నువ్వేం పీకావు
సినిమా తీసేటప్పుడు రెండు రకాల ప్రెజర్ ఉంటుంది. ఆల్రెడీ నటుడిగా ఉన్నవారితో సినిమా చేయడానికి వెళ్లి, వాళ్ల డేట్స్ సెట్ చేసుకుంటాం. వాళ్లు ఆరు నెలల తర్వాత చేస్తా, కొంతకాలం తర్వాత చేస్తా అనే టార్చర్ బెటరా? ఇక్కడ కొత్తవాళ్లను పెట్టుకుని వాళ్లకు యాక్టింగ్ మనం నేర్పిస్తూ ఆ ప్రాసెస్ టార్చర్ బెటరా? అనేది లెక్కలేసుకుంటాం. నాకు మాత్రం కొత్తవాళ్లతో తీయడమే కంఫర్ట్. మీరు చేసిన హీరోలలో ఆయన పెద్ద ప్రొడ్యూసర్.. వెరీ ఎస్టాబ్లిష్. అలాంటి అబ్బాయితో చేసినప్పుడు ఎలా డీల్ చేశారు? నార్మల్ పర్సన్‌లా డీల్ చేశారా? ఏమైనా అనుకుంటారేమో? అలా వెళ్లారా అని గోపీచంద్ ప్రశ్నించగా... అలాంటిదేమీ లేదు. నాకు అందరూ సమానులే. ఎందుకంటే సినిమా అనేది సరస్వతి. అందరికీ సమానం. కొంతమందికి చదువు బాగా నేర్పిస్తుంది. కొంతమందికి ఇంజనీరింగ్ నేర్పిస్తుంది. కొంతమందికి మెడిసిన్ నేర్పిస్తుంది. కొంతమందికి తబలా నేర్పిస్తుంది. అందరూ కావాలి మనకి, కాబట్టి అతను వాళ్ల తాత ఎవరైనా? ఫాదర్ ఎవరైనా సరే. ఆయనకు ముందే చెప్పాను. మీ తాత గొప్పోడు ఓకే.. మీ నాన్న గొప్పోడు ఓకే.. మీ చిన్నాన్న గోప్పోడు ఓకే. నువ్వేం పీకావు అది చెప్పు అన్నాను. ఆ మాటతో అతను బ్లాంక్ అయ్యాడని తేజ గుర్తుచేసుకున్నారు.

ఆ హీరో రెండు సార్లు ఏడ్చేశాడు
ఇప్పుడు నీకు ఛాన్స్ వచ్చింది.. నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. దీనిని కరెక్ట్‌గా వాడుకుని చేసుకో. మాట్లాడితే నేను వాళ్ల మనవడిని అని ఆలోచిస్తే చేయలేం. క్యారెక్టర్‌లో నీ పేరు ఇది.. ఆ పేరులాగానే బిహేవ్ చేయ్. చేసేంత వరకు వదలను. ఏది బెటర్... చేయడం బెటర్ కదా? ఫస్టే చేసేయ్. రెండు మూడు సార్లు పక్కకెళ్లి ఏడ్చేశాడు. టార్చరైతే పెట్టా.. నాకు ఎవరు కనిపిస్తారంటే చీకట్లో థియేటర్‌లో లైట్స్ అన్ని ఆర్పేసి సీట్లో కూర్చొని అలా చూస్తూ చప్పట్లు కొడతారే వాళ్లనే ఆలోచిస్తా. నేనేం అనుకున్నా, హీరో ఏమనుకున్నాడు, ప్రొడ్యూసర్ ఏమనుకున్నాడు వద్దు. ఎందుకంటే మనం ఫైనల్‌గా తీసింది డిసైడ్ చేసేది ఆడియన్స్. వాళ్ల కోసం చేయాలి అని తేజ తెలిపారు.

పిల్లలకు దాయాల్సింది గుడ్‌విల్
ఇప్పుడు అందరు హీరోలు, అందరు డైరెక్టర్లు ఎవరిని ముట్టుకున్నా సరే మల్టీ లాంగ్వేజ్, పాన్ ఇండియా, ప్యాన్ గ్లోబల్ అంటున్నారు. నా పిల్లలకు ఆస్తులు ఇవ్వను. ఓన్లీ యాటిట్యూడ్, బిహేవియర్ నేర్పిస్తాను. తేజ వాళ్ల అబ్బాయి కాబట్టి మనకి హెల్ప్ చేశారనే ఉద్దేశంతో కుర్చి వేసి గౌరవిస్తారు, నువ్వు చెప్పేది వింటారు. నువ్వు మాట్లాడిన తర్వాత నీ మాటలే ఎదుటివాళ్లకు గౌరవించాలో లేదో చెబుతాయి. పిల్లలకు దాయాల్సింది గుడ్‌విల్. జనం ఇప్పుడు ఓటీటీలో సినిమా చూడటానికే ఇష్టపడుతున్నారు. సినిమా థియేటర్‌కు రావడం లేదంటే జనాలు మారారు అనుకోవాలి. కానీ ఫస్ట్‌లో జనం నాటకాలు చూసేవారు, తర్వాత సినిమాలు, టీవీలు వచ్చాయి. టీవీ వచ్చాక థియేటర్ పడిపోవాలి. కానీ పడలేదు.. చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఓటీటీలు వచ్చినా థియేటర్‌కు వచ్చిన నష్టం లేదు. ఎవరికి కావాల్సింది వాళ్లు చూస్తారు.

సినిమాను చంపేది పాప్‌కార్నే
థియేటర్‌లో ఉన్న సినిమాను ఎవరు చంపలేరు.. ఏ ఫార్మాట్ చంపలేదు. ఓ మంచి సీన్‌ను మొబైల్‌లో చిన్న స్క్రీన్ మీద చూడటం కంటే పెద్ద సీన్‌లో ఆ ఎక్స్‌పీరియన్స్‌ను అనుభూతి చెందాలని అనుకుంటారు. థియేటర్‌లోదే సినిమా.. అదే బాగుంటుంది, చేతుల్లో, ట్యాబ్స్‌లో, టీవీలో చూసినా చిన్న సినిమానే. థియేటర్‌లో ఉన్న పెద్ద కంప్లయంట్ పాప్‌కార్న్ రేటే. మల్టీప్లెక్స్‌లో భారీగా ఉన్నాయి.. వాళ్లు మాత్రమే మన సినిమాను చంపేయగలరు. ఓటీటీ చంపలేదు, టీవీలు చంపలేవు.. కేవలం ఆ పాప్‌కార్న్ అమ్మేవాడు. హిందీలో మల్టీప్లెక్స్ ఎక్కువగా ఉండటం వల్ల సినిమా చచ్చిపోయింది.. తెలుగులో ఎక్కువ మల్టీప్లెక్స్ ఉండటం వల్ల చంపలేకపోతున్నారు. నేను అందరికీ రికమెండ్ చేసేది సింగిల్ స్క్రీన్‌కి వెళ్లమని అని తేజ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. తేజ చేతుల్లో టార్చర్ భరించిన ఆ హీరో ఎవరు? అతని ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ? అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X