Director Teja: సినిమాను చంపేసేది అదొక్కటే.. డైరెక్టర్ తేజ షాకింగ్ కామెంట్స్

తెలుగు చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ తేజ గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. జయం వంటి లవ్ స్టోరీ మూవీతో యావత్ తెలుగు ప్రేక్షకులు, విమర్శకుల చేత ప్రశంసలు అందుకున్నారు. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ను పరిచయం చేసింది కూడా ఆయనే. అయితే తేజ కెరీర్ లో విజయాలకంటే ఓటమిలే ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడుతూ, ఉన్నది ఉన్నట్లు చెప్పే తేజ తాజాగా సినిమా చావడానికి కారణం ఏంటో తెలిపారు.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన చిత్రం రామ బాణం. శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డస్కీ బ్యూటి డింపుల్ హయాతి హీరోయిన్ గా నటించింది. మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా.. జగపతి బాబు కీలక పాత్ర పోషించారు. అలాగే కుష్బూ, సచిన్ ఖేడేకర్, నాజర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిశోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, తరుణ్ అరోరా, సమీపర్ తదితరులు నటించారు.

Director Teja

పూర్తి ఇంటర్వ్యూ : రామ బాణం సినిమా మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. ఇటీవల గోపీచంద్ ను ప్రముఖ దర్శకుడు తేజ ఇంటర్వ్యూ చేసిన ప్రోమో వైరల్ అయింది. ఇప్పుడు పూర్తి ఇంటర్వ్యూను అందుబాటులో ఉంచారు. ఇందులో సినిమా చావడానికి కారణం చెబుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు తేజ.

థియేటర్లలో చూసేదే : "సినిమాలను థియేటర్లలో చూస్తేనే అనుభూతి చెందగలం. టీవీల్లో, సెల్ ఫోన్లలో పూర్తి స్థాయిలో ఆస్వాదించలేం. అవతార్ వంటి సినిమాలను థియేటర్లలో చూస్తేనే మజా వస్తుంది. సింగిల్ స్క్రీన్ లో పెద్ద సర్కీన్స్ ఉన్న థియేటర్లకు వెళ్లి చూసిన మంచి అనుభూతి కలుగుతుంది. నేను ప్రతి వీకెండ్ కు థియేటర్లో సినిమా చూస్తా. థియేటర్లలో చూసేదే సినిమా. అందుకే నా ఇంట్లో హోమ్ థియేటర్ పెట్టుకోలేదు" అని తేజ అన్నారు.

Director Teja

ప్రజల వల్ల కాదు: "ఓటీటీలు, సెల్ ఫోన్లు సినిమాను చంపలేవు. అయితే సినిమా కోసం థియేటర్లకు వెళ్లినప్పుడు పాప్ కార్న ధరలపై ఫిర్యాదు వస్తోంది. మల్టీ ఫ్లెక్స్ థియేటర్లలో పాప్ కార్న్ ధరలు భయంకరంగా ఉంటున్నాయి. కోక్ రేట్ విపరీతంగా ఉంటుంది. వాటిని కొనడం మధ్యతరగతి ప్రజల వల్ల కాదని అంటున్నారు. మల్టీ ప్లెక్స్ లో ఉన్న పాప్ కార్న్ ధరల వల్లే సినిమా చనిపోతుంది" అని డైరెక్టర్ తేజ తెలిపారు.

చంపలేకపోతున్నాయి: తేజ ఇంకా కొనసాగిస్తూ "బాంబేలో హిందీ సినిమాలు చనిపోవడానికి కారణం ఆడియెన్స్ కాదు. అక్కడ సింగిల్ స్క్రీన్స్ ఉండవు. మల్టీ ఫ్లెక్స్ లలో పాప్ కార్న్ ధరే చంపేసింది. తెలుగులో ఎక్కువ సింగిల్ స్కీన్స్ ఉండటం వల్ల చంపలేకపోతున్నాయి. కేవలం పాప్ కార్న్ మాత్రమే సినిమాను చంపగలదు" అని షాకింగ్ కామెంట్స్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X