రాజమౌళి పొట్టోడు.. ఆ డైరెక్టర్ అప్పట్లో అలా, మరి ఇప్పుడు ఎలా అంటే?
దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి సినిమా తో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు. ఆ సినిమా దెబ్బకు ఆయనతో సినిమా చేయడం కాదు కదా కనీసం ఆయనతో ఒక్కసారి కలిసి కాసేపు కూర్చుంటే చాలు అని మన హీరోలు భావిస్తూ ఉంటారు. కానీ ఆయనని ఒక దర్శకుడు పొట్టోడా అని పిలిచేవారట, ఎవరా దర్శకుడు ? ఏమిటా కధ అనేది తెలుసుకుందాం.

ఆరోజుల్లో
ఒక రకంగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దగ్గర శిష్యరికం చేసిన రాజమౌళి సినిమాలు, సీరియల్స్ చేయడం మొదలు పెట్టాడు అని అందరూ భావిస్తూ ఉంటారు. నిజానికి అంత కంటే ముందే రాజమౌళి తన తండ్రి దగ్గర స్క్రిప్ట్ అసిస్టెంట్ గా పని చేశారు. అలాగే ఆ తర్వాత క్రాంతి కుమార్ అనే దర్శకుడు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ రాజమౌళి ఒక ఈవెంట్ లో ఆసక్తికర సన్నివేశాలు ప్రేక్షకులతో పంచుకున్నారు.

ఏడేళ్ళ క్రితం
సరిగ్గా ఏడేళ్ల క్రితం దిక్కులు చూడకు రామయ్య అనే సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. హీరో నాగ శౌర్య, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అజయ్ తండ్రీకొడుకులుగా నటించిన ఈ సినిమా అప్పట్లో హిట్ కాకపోయినా మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమా తెరకెక్కించిన దర్శకుడే త్రికోటి, ఆయన రాజమౌళికి సీనియర్ అట. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజమౌళి తనకు త్రికోటికి మధ్యనున్న అనుబంధాన్ని పంచుకున్నారు

సీనియర్ గా త్రికోటి
తామిద్దరం క్రాంతికుమార్ వద్ద శిష్యరికం చేస్తూ ఉన్నప్పుడు తనకు సీనియర్ గా త్రికోటి ఉండేవారని, ఆ రోజుల్లో అమీర్పేట్ శీష్ మహల్ లో బొబ్బిలి రాజా లాంటి పాత సినిమాలు వేస్తే అవి చూడడానికి వెళ్ళేవాళ్ళమని అన్నారు. ఆ సినిమాలు చూసి తామిద్దరం మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చే వాళ్లం అని చెప్పుకొచ్చారు. జారిపోతున్న పాంట్ ని పైకి లాక్కుని టూ తనను పొట్టోడా అంటూ త్రికోటి అనే వారని రాజమౌళి చెప్పుకొచ్చారు. ఇదేంటి ఇద్దరూ ఒకే హైట్ ఉంటే నన్ను పొట్టోడా అంటాడు అని అడిగితే పొట్టోడా అంటే చిన్నోడా అని అర్థం అని ఆయన చెప్పుకొచ్చేవారట.

రాజమౌళి దగ్గరే అసిస్టెంట్
ఇక తర్వాతి రోజుల్లో రాజమౌళి పెద్ద దర్శకుడిగా మారాక త్రికోటిని తన దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అవమని రాజమౌళి కోరారట. రాజమౌళి టేకింగ్, రాజమౌళి మీద నమ్మకంతో ఆయన వెంటనే జాయిన్ అయిపోయారు అట. అలా జాయిన్ అయిన కొత్తలో మౌళి అని పిలిచే ఆయన తర్వాత కాలంలో సార్ అని పిలిచే దాకా వెళ్లారట. అయితే ఎవరూ లేనప్పుడు మాత్రం మౌళి అనే పిలుస్తారట. ఇక ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో మళ్ళీ ఆయన రాజమౌళి సినిమాలకే పని చేస్తున్నారు.
Recommended Video

సినిమాల విషయానికి వస్తే
ఇక రాజమౌళి ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఈ సినిమా అక్టోబర్ నెలలో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా పూర్తి అయ్యాక ఆయన మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











