కె.విశ్వనాథ్ దర్శకత్వంలో అలాంటి సినిమా తీయాలని మాట తీసుకున్న త్రివిక్రమ్.. ఆ కోరిక తీరకుండానే..
కళాతపస్వి కె.విశ్వనాథ్ హఠాత్తుగా కన్నుమూయడంతో సినిమా పరిశ్రమలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. తెలుగు పరిశ్రమకు ఒక గౌరవం తీసుకు వచ్చేలా సినిమాలను తెరకెక్కించిన ఆయన అంటే నేటితరం దర్శకులకు కూడా ఒక స్పూర్తిగా నిలుస్తారు. ఇక ఆయన దర్శకత్వంలో త్రివిక్రమ్ నిర్మాతగా ఒక సినిమా చేయాలని అనుకున్నారు. ఆ విషయంలో త్రివిక్రమ్ మాట కూడా తీసుకున్నారు. ఒక ఇంటర్వ్యూలో వీరికి జరిగిన సంభాషణ వివరాల్లోకి వెళితే...

స్టార్ దర్శకులు ఆయనకు ఫ్యాన్స్
కె.విశ్వనాథ్ అనగానే స్వాతిముత్యం, శంకరాభరణం, సాగర సంగమం, స్వాతి కిరణం ఇలా ఎన్నో క్లాసిక్ సినిమాలు గుర్తుకు వస్తాయి. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా సక్సెస్ అయిన సినిమాలు కె.విశ్వనాథ్ గారివి మాత్రమే ఎక్కువగా ఉంటాయి. ఇక త్రివిక్రమ్ లాంటి దర్శకులు కూడా ఆయనకు అభిమానులే. రామ్ గోపాల్ వర్మ కూడా ఆయన సినిమాలకు నేను కూడా ఫ్యాన్ అని చెబుతారు.

సినిమా ఇండస్ట్రీ గౌరవం పెంచేలా
సినిమా ఇండస్ట్రీ అనగానే కొన్ని సందర్భాల్లో చులకనగా చేసి మాట్లాడేవారి సంఖ్య ఎక్కువగా ఉండేది. అలాంటి వారికి తెలుగు సాహిత్యాన్ని సంప్రదాయాలను అద్దం పట్టేలా చేసిన ఏకైక దర్శకుడు కె.విశ్వనాథ్. సినిమా ఇండస్ట్రీ గౌరవం పెంచేలా అప్పట్లో ఆయన సినిమాలు వచ్చేవి. ప్రతీ సన్నివేశంలో కూడా కె.విశ్వనాథ్ తన మార్క్ చూపించేలా సినిమాలను డైరెక్ట్ చేసేవారు. ఇక అదే ఆయనపై గౌరవాన్ని పెంచినట్లు.. త్రివిక్రమ్ తెలిపారు.

త్రివిక్రమ్ కు ఇష్టమైన సినిమా
త్రివిక్రమ్ ప్రత్యేకంగా కె విశ్వనాథ్ ఇంటర్వ్యూలో ఒకసారి పాల్గొన్నారు. ఆయన సినిమాల్లో నాకు అత్యంత ఇష్టమైనది సాగరసంగమం ఆ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమ బ్రతుకునంత కాలం అందరికీ గుర్తుండిపోతుంది అని అన్నారు. అలాగే శంకరాభరణం వంటి సినిమాను ప్రస్తావించకుండా తెలుగు సినిమా ఉనికి ఉండదు అని త్రివిక్రమ్ అన్నారు.

త్రివిక్రమ్ తో సినిమా
కె.విశ్వనాథ్ తో ప్రత్యేకంగా చేసిన ఒక ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ ఒక కోరిక కోరారు. మీరు తప్పకుండా ఇంకో సినిమా తీయాలి. నేను ఆ సినిమాకు నిర్మాతగా ఉంటాను అని మాట కూడా తీసుకున్నారు. అయితే కె.విశ్వనాథ్ కూడా ఒక కోరిక కోరారు. నీ సినిమాలో నాకు ఒక పాత్రలో నటించే అవకాశం ఇవ్వాలి అన్నారు. తప్పకుండా అంటూ మీరు మాత్రం మరో సినిమాను డైరెక్ట్ చేయాలి అన్నారు.

విశ్వనాథ్ తో గొడవ
మీరు తప్పకుండా మీ స్టైల్ లోనే మరో చక్కటి తెలుగు సినిమాను డైరెక్ట్ చేస్తుంటే మీతో కలిసి సినిమాను నిర్మించాలని ఉంది అని త్రివిక్రమ్ చెప్పారు. అందుకు కె.విశ్వనాథ్ నేను చెప్పే కథ నీకు నచ్చకపోతే అని అన్నారు. ఇక మనం ఇద్దరం గోడవపడదం అని నవ్వుతూ అన్నారు. మీతో ఆ వర్కింగ్ ప్రాసెస్ నాకు కావాలి. అందులో ఎంజాయ్ చేయాలి.. అని త్రివిక్రమ్ ఆప్యాయంగా కె.విశ్వనాథ్ కు తెలియజేశారు. ఇక ఆ కోరిక నెరవేరకుండానే కె.విశ్వనాథ్ కన్నుమూశారు.


Click it and Unblock the Notifications











