నాని, విజయ్ దేవరకొండలతో త్రివిక్రమ్ మూవీ.. ఏదైనా ఎన్టీఆర్ తరువాతే?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా కోసం సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. అల..వైకుంఠపురములో.. సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకోవడంతో త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాలపై కూడా అంచనాల డోస్ మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే ఎలాంటి రూమర్స్ వచ్చినా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఎన్టీఆర్ సినిమా కంటే ముందే త్రివిక్రమ్ ఒక చిన్న చిన్న బడ్జెట్ లో సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు మొన్నటివరకు ఒక టాక్ వచ్చింది. నాని విజయ్ దేవరకొండ వంటి యువ హీరోల డేట్స్ కోసం కూడా త్రివిక్రమ్ ప్రయత్నం చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదని తెలిసిపోయింది. ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కంటే ముందు త్రివిక్రమ్ ఎలాంటి సినిమాను ఎనౌన్స్ చేసే ఛాన్స్ లేదని తేలిపోయింది.

ఏదైనా ఎన్టీఆర్ సినిమా తరువాతే అని త్రివిక్రమ్ సన్నిహితులు చెబుతున్నారు. ఎన్టీఆర్ RRR సినిమాను పూర్తి చేయడానికి మరికొన్ని రోజులు అవసరం కాబట్టి త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ఆ గ్యాప్ లో త్రివిక్రమ్ చిన్న బడ్జెట్ సినిమా చేసే అవకాశం ఉందని రూమర్స్ వచ్చాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది.


Click it and Unblock the Notifications











