వర్మ తీసేదంతా సొల్లు.. అతడికి పిచ్చిపట్టిందేమో.. యువ దర్శకుడు మండిపాటు
దర్శకుడు రాంగోపాల్ వర్మపై వర్థమాన దర్శకుడు, స్పెషల్ మూవీ డైరెక్టర్ వాస్తవ్ మండిపడ్డారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ వివాదం మళ్లీ ఊపందుకొన్న నేపథ్యంలో ఆయన స్పందించారు. శివ, క్షణక్షణం చిత్రాల తర్వాత ఎంతో మందికి ఆయన స్ఫూర్తి నింపడమే కాకుండా ఎందరికో మార్గదర్శకుడు అయ్యారు. 20 సంవత్సరాల తర్వాత టెర్మినేటర్ లాంటి గొప్ప సినిమాలను భారతీయ సినిమాకు అందిస్తారనే అందరూ ఎదురుచూశారు. కానీ ఆయన ఐస్‌క్రీమ్, ఆఫీసర్, లక్ష్మీస్ ఎన్టీఆర్ లాంటి నాసిరకమైన సినిమాలను రూపొందిస్తున్నాడు.
అదే సమయంలో జెంటిల్మన్‌తో సినీ రంగంలోకి ప్రవేశించిన శంకర్.. రొబో, 2.0 చిత్రాలను తీస్తున్నాడు. ఇంకా చాలా మంది కొత్త దర్శకులు ప్రేక్షకులను అబ్బురపరిచే చిత్రాలను రూపొందిస్తున్నారు అనే అభిప్రాయాన్ని వాస్తవ్ మీడియాతో పంచుకొన్నారు.

రాంగోపాల్ వర్మ తీసే సినిమాలు అంతా సొల్లు.. అతడికి పిచ్చిపట్టిందేమో అని అనుకొంటున్నారు. ఇటీవల ఎవడో రాసిచ్చిన పాటను పాడి సోషల్ మీడియాలో పెట్టాడు. ఆ పాట చూస్తే మినిమిమ్ సెన్స్ లేదనిపిస్తున్నది. ఇలాంటి వర్మ శివ లాంటి గొప్ప సినిమాను తీశారంటే ప్రేక్షకులు నమ్మలేకపోతున్నారు. ఆయన చెప్పే కబుర్లు విని నిర్మాతలు, నటీనటులు మోసపోతున్నారు అని వాస్తవ్ సోషల్ మీడియాలో ధ్వజమెత్తాడు.



Click it and Unblock the Notifications











