ఆ డైరెక్టర్ ఒకే రాత్రి ఐదుగురు అమ్మాయిలతో.. అది విని షాకయ్యా

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక శైలితో క్లాసిక్ సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు వంశీ (Vamshi). ఇటీవల ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారారు. సాధారణంగా సినిమాల గురించి, ప్రకృతి గురించి, మనుషుల భావోద్వేగాల గురించి మాట్లాడే వంశీ ఈసారి మాత్రం ఇండస్ట్రీలోని సంబంధాలు, హీరోయిన్లతో తన అనుబంధం, వ్యక్తిగత ప్రేమ జ్ఞాపకాల గురించి ఎంతో ఘాటుగా స్పందించారు. ముఖ్యంగా "నా బంధాలు అన్నీ మానసికమైనవే కానీ, శారీరకమైనవి కావు" అని ఆసక్తికరం వ్యాఖ్యలు చేశారు.

తెలుగు ప్రేక్షకులకు వంశీ అంటే కేవలం దర్శకుడు మాత్రమే కాదు.. భావోద్వేగాలను, గ్రామీణ జీవనాన్ని తెరపై కవిత్వంలా చూపించిన కథకుడు. గోదావరి జిల్లాల అందాలను, పల్లెటూరి మనుషుల అమాయకత్వాన్ని, ప్రేమను, హాస్యాన్ని ఆయన చూపించిన తీరు ఇప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోయింది. 'సితార', 'అన్వేషణ', 'లేడీస్ టైలర్', 'మహర్షి', 'ఏప్రిల్ 1 విడుదల', 'డిటెక్టివ్ నారద', 'జోకర్', 'ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు' వంటి చిత్రాలు తెలుగు సినీ చరిత్రలో క్లాసిక్‌లుగా నిలిచాయి. ముఖ్యంగా వంశీ సినిమాల్లో కనిపించే హాస్యం, సంగీతం, ప్రకృతి అందాలు ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి.

Director Vamsy Shocking Comments on Film Industry Affairs and Emotional Relationships

ఈ ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో సంబంధాలపై వంశీ షాకింగ్ కామెంట్స్ చేశారు. సినిమా రంగంలో హీరో-హీరోయిన్ల మధ్య, దర్శకులు-హీరోయిన్ల మధ్య ఎఫైర్లు ఉంటాయనే వార్తలు తరచూ వినిపిస్తుంటాయని, వాటిలో కొంత నిజం కూడా ఉంటుందని ఆయన ఒప్పుకున్నారు. కలిసి ఎక్కువ రోజులు పని చేయడం వల్ల భావోద్వేగ అనుబంధాలు ఏర్పడటం సహజమని చెప్పారు. అయితే తన విషయంలో మాత్రం ఎప్పుడూ అలాంటివి జరగలేదని స్పష్టం చేశారు. "నాకు హీరోయిన్లతో కానీ, అమ్మాయిలతో కానీ మానసికమైన ప్రేమ మాత్రమే ఉంటుంది. దాన్ని మించి ముందుకు వెళ్లడం నాకు ఇష్టం ఉండదు" అని ఆయన చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఈ సందర్భంగా ఆయన బ్యాంకాక్‌లో జరిగిన ఓ సంఘటనను కూడా వివరించారు. ఒకసారి సినిమా కథా చర్చల కోసం కొంతమంది రైటర్లతో కలిసి బ్యాంకాక్ వెళ్లినప్పుడు, తనతో ఉన్న ఓ యువ రచయిత ఒక హోటల్ రూమ్ చూపిస్తూ "ఈ గదిలో ఒక ప్రముఖ దర్శకుడు ఒకే రాత్రిలో ఐదుగురు అమ్మాయిలతో గడిపాడు" అని చెప్పాడట. ఆ మాటలు విన్న వెంటనే తాను తీవ్రంగా షాక్ అయ్యానని వంశీ చెప్పారు. "అలాంటి ప్రవర్తన నాకు అస్సలు నచ్చదు. నేను ఆ రకమైన వ్యక్తిని కాదు" అని స్పష్టం చేశారు. ఇండస్ట్రీలో జరిగే కొన్ని విషయాలు తనకు అసహ్యంగా అనిపిస్తాయని, సంబంధాల విషయంలో తాను ఎప్పుడూ హద్దులు దాటలేదని అన్నారు.

ఇక తన వ్యక్తిగత జీవిత విషయాలను కూడా వంశీ పంచుకున్నారు. తాను జీవితంలో ప్రేమించిన ఒక వ్యక్తిని ఇప్పటికీ మర్చిపోలేదని తెలిపారు. "ఆమె జ్ఞాపకాలు ఇప్పటికీ నా మనసులో ఉన్నాయి. అవే నాకు ఆనందాన్ని ఇస్తుంటాయి. మళ్లీ ఇంకొక అడుగు ముందుకు వేయాలని నేను ఎప్పుడూ అనుకోలేదు" అని అన్నారు. గతాన్ని మళ్లీ నిజం చేయాలని కూడా తాను కోరుకోనని చెప్పడం ఆయన మనసులో ఆ ప్రేమ ఇప్పటికీ ఎంత బలంగా ఉందో తెలియజేస్తోంది.

ఈ సందర్భంగా సీనియర్ నటి భానుప్రియతో తనకు ఎఫైర్ ఉందనే ప్రచారాల గురించి కూడా పరోక్షంగా స్పందించారు. 'సితార' సినిమా సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ ఉందని, పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారని అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి. అయితే తన సంబంధాలు ఎప్పుడూ భావోద్వేగ స్థాయిలోనే ఉండేవని మరోసారి స్పష్టం చేశారు.వంశీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Read more about: tollywood vamshi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X