వాళ్ళపై ట్రోల్స్ చేయడం కరెక్ట్ కాదు.. వాళ్ళు గొప్ప దర్శకులు.. వెంకటేష్ మహా మరో క్లారిటీ!
C/O కంచరపాలెం అనే సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపును అందుకున్న వెంకటేష్ మహా ఆ తర్వాత ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అనే సినిమాతో కూడా పరవాలేదు అనిపించాడు. అయితే అతను ఇటీవల ఇంటర్వ్యూలో చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో ఓ వర్గం అభిమానులను ఆగ్రహానికి గురి చేశాయి. అయితే డైరెక్టర్ వెంకటేష్ మహాతోపాటు ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్న మిగతా దర్శకులపై కూడా ట్రోల్స్ గట్టిగానే వస్తున్నాయి. ఇక ఈ విషయంలో దర్శకుడు మరో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

ఆ దర్శకులు కూడా
ఇటీవల ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో దర్శకుడు వెంకటేష్ తో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు అందుకున్న మరి కొంతమంది దర్శకులు కూడా ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. నందిని రెడ్డి తో పాటు మోహనకృష్ణ ఇంద్రగంటి అలాగే శివ నిర్వణ, వివేకాత్రియ కూడా వారి ఆలోచన విధానాన్ని వ్యక్తపరిచారు.

చాలా దారుణమని
ఇక వెంకటేష్ అయితే కాస్త హద్దులు కామెంట్ చేసినట్లుగా నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. KGF సినిమా పేరు ఎత్తకుండా అందులో హీరో అలాగే హీరో తల్లి పాత్ర కూడా చాలా దారుణమని కొంత కఠినమైన మాటలు మాట్లాడడంతో వెంకటేష్ ను ఇప్పుడు కన్నడ సినీ అభిమానులతో పాటు ఓ వర్గం తెలుగు ప్రేక్షకులు కూడా తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు.

వారిపై ట్రోల్స్
అయితే వెంకటేష్ ఆ విధంగా వివరణ ఇవ్వడంతో పక్కనే ఉన్న వివేక్ ఆత్రేయ అలాగే నందిని రెడ్డి మోహన్ కృష్ణ ముగ్గురు కూడా పగలబడి నవ్వారు అని వారికి కూడా సినిమా అంటే గౌరవం లేదు అని ఒక సినిమాకు ఎంతగా కష్టపడతారో తెలిసి కూడా ఈ విధంగా హేళన చేసినట్లుగా అక్కడ కనిపించడం అనేది కరెక్ట్ కాదు అని.. నెటిజన్లు తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ట్రోల్స్ కూడా గట్టిగానే వస్తున్నాయి.

క్షమాపణ కోరుతూ..
అయితే వెంకటేష్ తో పాటు నందిని రెడ్డి మోహనకృష్ణ వివేక్ ఆత్రేయ ముగ్గురు కూడా సోషల్ మీడియాలో జరిగిన ఇంటర్వ్యూలో ఏదైనా తప్పుగా అనిపిస్తే క్షమించాలని కూడా అందరినీ కోరారు. ఇక ఈ విషయంపై వెంకటేష్ కూడా తనదైన శైలిలో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ముందుగా అయితే తాను చెప్పిన పాయింట్ అనేది కరెక్ట్ కానీ చెప్పిన విధానంలో తప్పులు ఏమైనా ఉండవచ్చు అని అలాంటి భాష వాడడం కూడా తప్పుగా ఉండవచ్చు అని వివరణ ఇచ్చాడు.

చాలా బాధాకరమైన విషయం
గత 24 గంటల్లో జరిగిన దానికి ఫాన్స్ వ్యక్త పరుస్తున్న ఎమోషన్ ను నేను అర్థం చేసుకోగలను గౌరవిస్తాను. మీరు చూసింది కేవలం రెండు నిమిషాల క్లిప్ మాత్రమే. కానీ ఆ ఇంటర్వ్యూలో ఉన్న నాతోటి దర్శకులను కూడా ట్రోల్స్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. నా అభిప్రాయంపై వాళ్లు ట్రోల్స్ ఎదుర్కోవడం సరికాదు. వాళ్లు తెలుగు ఇండస్ట్రీలోనే చాలా గొప్ప దర్శకులు అని వెంకటేష్ మహా వివరణ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











