వకీల్ సాబ్ లీక్.. అది కూడా అలా ఉపయోగపడింది: వేణు శ్రీరామ్
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న వకీల్ సాబ్ మరికొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఒక విదంగా లాక్ డౌన్ అనంతరం విడుదలవుతున్న అతిపెద్ద సినిమా ఇదే. ఈ సినిమాపై కేవలం అభిమానుల్లోనే కాకుండా ఇండస్ట్రీ ప్రముఖుల్లో కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్ లో దర్శకుడు వేణు శ్రీరామ్ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలని భయటపెట్టాడు.

భరోసా ఇస్తున్నాను
దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. సినిమా తప్పకుండా అభిమానుల అంచనాలకు తగ్గట్లుగానే ఉంటుందని ఎవరిని కూడా నిరాశపరచదని భరోసా ఇస్తున్నట్లు చెప్పారు. ఇక సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎంత జోడించినా కూడా మెయిన్ స్టోరీ ఏ మాత్రం మిస్సవ్వలేదని చెప్పారు.

థమన్ కూడా ప్రాణం పెట్టేశాడు
దర్శకుడు వేణు శ్రీరామ్ మేకింగ్ విజన్ కు పవన్ కూడా ఫిదా అయ్యాడట. పవన్ తో వర్క్ చేయడం నా డ్రీమ్ అంటూ ఈ సినిమా కోసం నేను మాత్రమే కాకుండా థమన్ కూడా ప్రాణం పెట్టేసినట్లు వేణు శ్రీరామ్ తెలియజేశారు. అయితే పవన్ తో వర్క్ చేసే క్రమంలో ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తూ షూట్ చేశామని వివరించారు.

లీక్ అయిన తరువాత
ఇక వకీల్ సాబ్ టైటిల్ పెట్టడాని కంటే ముందే షూటింగ్ కు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఆ విషయం గురించి స్పందించిన వేణు శ్రీరామ్ అది కూడా మాకు చాలా బాగా ఉపయోగపడిందని అన్నారు. ఎందుకంటే సినిమా టైటిల్ లో పవన్ కళ్యాణ్ నడుస్తున్న లోగో జత చేయడానికి కారణం లీకైన ఫొటోనే అని చెప్పారు.

అలా ఉపయోగపడింది
సోషల్ మీడియాలో కూడా పవన్ నడుస్తున్నట్లు ఉన్న ఫొటో బాగానే వైరల్ అయ్యింది. అందుకే ఆ ఐకానిక్ లుక్ టైటిల్ లోగోలో యూజ్ చేసుకున్నట్లు దర్శకుడు వివరణ ఇచ్చారు. ఇక ఫ్యాన్స్ కు ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి సందేశాన్ని కూడా ఇస్తుందని అంటూ సినిమాలో పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చాలా రియాలిటీగా ఉంటుందని వేణు శ్రీరామ్ మాట్లాడారు.


Click it and Unblock the Notifications











