‘విరాట పర్వం’ విడుదలపై మరోసారి క్లారిటీ: డేట్ మాత్రం అప్పుడేనట

టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా నటించిన తాజా చిత్రం 'విరాట పర్వం'. వేణు ఉడుగుల తెరకెక్కించిన ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తైంది. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ అయింది. అయితే, కరోనా లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా విడుదల మాత్రం అనుకున్న సమయానికి కాలేదు. దీంతో ఇది ఓటీటీలో విడుదల కాబోతుందని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ, ఆ వెంటనే చిత్ర యూనిట్ ఈ వార్తలను ఖండించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా రిలీజ్‌పై మరోసారి డైరెక్టర్ క్లారిటీ ఇచ్చాడు. అలాగే, రిలీజ్ డేట్ విషయంపైనా స్పందించాడు.

బాబోయ్ ఏంటా అందాలు: ఫిట్‌నెస్ మోడల్ అదితి మిస్త్రీ వైరల్ (ఫోటోలు)

కరోనా రెండో దశ వల్ల ఈ మధ్య థియేటర్లు మూత పడ్డాయి. దీంతో కొన్ని బడా చిత్రాలతో పాటు చిన్న సినిమాలు ఓటీటీలో వస్తాయని ప్రచారం జరిగింది. అయితే, 'విరాట పర్వం' మాత్రం థియేటర్లలోనే వస్తుందని చిత్ర యూనిట్ ఎన్నిసార్లు చెప్పినా.. ఇది ఓటీటీలో రిలీజ్ అవుతుందనే టాక్ వినిపిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు వేణు ఉడుగుల స్పందిస్తూ.. 'విరాట పర్వం చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయం. దీని కోసం భారీ ఆఫర్లు వచ్చినా.. థియేటర్లలోనే విడుదల చేయాలని వాటిని రిజెక్ట్ చేశాం. రెండు రాష్ట్రాల్లో థియేటర్లకు పర్మీషన్ వచ్చిన తర్వాత కొత్త రిలీజ్ డేట్ గురించి ప్రకటిస్తాం' అని ఆయన చెప్పారు.

Photos: Actress Caught Smoking On & Off Screen

Director Venu Udugula Clarity about Rana Daggubatis Virata Parvam Release

సున్నితమైన ప్రేమకథకు నక్సలైట్ ఉద్యమాన్ని జోడించి 'విరాట పర్వం' సినిమాను తెరకెక్కించారు. ఇందులో దగ్గుబాటి రానా కామ్రెడ్ రవన్నగా నటిస్తుండగా.. అతడికి జోడీ అయిన పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి చేసింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన పాటలు, టీజర్, పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాను ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. నివేదా పెతురాజ్, ప్రియమణి, నందితాదాస్‌, నవీన్‌చంద్ర, జరీనా వహాబ్‌, ఈశ్వరీరావు, బెనర్జీ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. సురేష్ బొబ్బిలి స్వరాలు సమకూర్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X