Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
డిస్కోరాజా కథపై అసంతృప్తిగా రవితేజ!
మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం విఐ ఆనంద్ దర్శత్వంలోడిస్కోరాజా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు విఐ ఆనంద్ గతంలో ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం లాంటి థ్రిల్లర్ చిత్రాలని రూపొందించాడు. ఈ చిత్రం కూడా అదే తరహాలో సైంటిఫిక్ ఎలిమెంట్స్ తో ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రవితేజ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టైటిల్ పోస్టర్ కూడా అందరిలో ఆసక్తిని రేకెత్తించింది.
కాగా డిస్కోరాజా కథకు ఇప్పటికి కొన్ని మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయట. కథలో కొన్ని సన్నివేశాల పట్ల రవితేజ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సన్నివేశాలపై దర్శకుడు విఐ ఆనంద్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రంలో ఉండే సస్పెన్స్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి. అదే తరహాలో తెరకెక్కించిన ఒక్క క్షణం చిత్రం బాక్సాఫీస్ వద్ద చతికిలబడింది.
దీనితో డిస్కోరాజా కథలో అలాంటి లోపాలు లేకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. ఇక రవితేజ ఇటీవల నటించిన చిత్రాలు డిజాస్టర్స్ గా నిలిచాయి. రవితేజ తన కెరీర్ ని నిలబెట్టుకోవాలంటే డిస్కోరాజాతో హిట్ కొట్టడం తప్పనిసరి.రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.