కరోనాకు వినాయక్ పాత మందు.. ఆ ఇంజెక్షన్ పనికొస్తుందేమో చూడండి.. వైద్యులకు సలహా

టాలీవుడ్ సీనియర్ దర్శకుడు వివి.వినాయక్ చాలా రోజుల తరువాత మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. ఎవరు ఉహీంచని విధంగా కరోనాను విరుగుడు సలహా ఇవ్వడం వైరల్ గా మారింది. ప్రస్తుతం ప్రపంచమంతా కరోనాకు మందు కనిపెట్టడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే ఒకప్పుడు తాను తీసుకున్న మందు దీనికి పని చేస్తుందేమో చూడండి అంటూ ఆయన ఒక వీడియో ద్వారా వివరణ ఇచ్చారు.

వినాయక్ సలహా..

వినాయక్ సలహా..

కరోనాకు సంబంధించి చాలా మంది సెలబ్రెటీలు చాలా విభిన్నంగా సలహాలు ఇస్తున్నారు. ఎక్కువగా వ్యాయామాలు యోగాలు చేయండి అంటూ తగిన పోషక ఆహారం తీసుకుంటే కరోనాను ఈజీగా అరికట్టవచ్చని చెబుతున్నారు. ఇక దర్శకుడు వినాయక్ మాత్రం గతంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెబుతూ ఒక ఇంజెక్షన్ దీనికి పనికొస్తుందేమో చూడండి అంటూ వైద్యులకు వివరణ ఇచ్చారు.

ఎల్లో ఫీవర్ ఇంజెక్షన్..

ఎల్లో ఫీవర్ ఇంజెక్షన్..

వినాయక్ ఆ విషయంపై మాట్లాడుతూ.. ఒకసారి కెన్యా వెళ్లాల్సిన అవసరం వచ్చింది. అయితే అక్కడికి వెళ్లేముందు ఒక ఇంజెక్షన్ ఇచ్చారు. అది ఎల్లో ఫీవర్ అనే దానికోసం ఇచ్చారు. అంటే అక్కడికి వెళ్లే విదేశీయులకు అలాంటి ఇంజక్షన్ ఇవ్వడం తప్పనిసరి. ఆ దేశస్తులకు మాత్రం అది ఇమ్యున్ అయ్యి ఉంటుంది. వేరేవాళ్లకు రాకుండా ముందుగా ఈ ఎల్లో ఫీవర్ కి ఇంజెక్షన్ ఇస్తారు.

ఇది పనికొస్తుందా అని అడిగితే..

ఇది పనికొస్తుందా అని అడిగితే..

అయితే కరోనాకు ఎలాంటి లక్షణాలు ఉంటాయో దాదాపు ఎల్లో ఫీవర్ కి కూడా అలాంటి లక్షణాలే ఉంటాయి. కొంతమంది వైద్యులను నేను ఈ విషయం గురించి అడిగాను. ఎల్లో ఫీవర్ కోసం వాడిన మందు దీనికి పనికొస్తుందా అనే సందేహానికి ఎవరు సరైనా సమాధానం చెప్పలేదు. కొన్నిసార్లు అందరికి తెలిసిన విషయమే అయినా సరైన సమయంలో చిన్న ఐడియా రాకపోవచ్చు.

వైద్యులు ఆలోచించాలి..

వైద్యులు ఆలోచించాలి..

నేను చెప్పిన ఈ విషయం ఎంతవరకు ఉపయోగమో నాకు తెలియదు. కానీ వైద్యులు ఒక్కసారి ఆలోచిస్తే బావుంటుందని వినాయక్ అన్నారు. అలాగే ఇటీవల ఇద్దరు వైద్యులు కరోనా రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలపై అందరికి అర్థమయ్యేలా వివరించిన విధానం వినాయక్ ని ఎంతగానో ఆకట్టుకుంది. నేను చెప్పిన ఎల్లో ఫీవర్ మెడిసిన్ గురించి కూడా వారు ఒకసారి ఆలోచించాలని వినాయక్ తెలిపాడు.

Recommended Video

Actress Sai Dhansika New Movie Opening
ఇది నా ఆలోచన మాత్రమే..

ఇది నా ఆలోచన మాత్రమే..

ఇక తాను చెప్పిన ఈ విషయం జస్ట్ ఒక ఆలోచన మాత్రమే అంటూ నిజంగా ఎల్లో ఫీవర్ ఇంజక్షన్ దానికి ఉపయోగపడుతుందో లేదో తెలియదు గాని దాదాపు అవే లక్షణాలు ఉండడం వలన ఏమైనా దారి దొరకవచ్చు అన్నట్లుగా వినాయక్ తనదైన శైలిలో వివరణ ఇచ్చాడు. ఇక తాను చెప్పిన ఈ విషయాన్నీ ఎవరు పాటించవద్దని కేవలం వైద్యులకు మాత్రమే తన ఆలోచనను వివరించినట్లు చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X