వీవీ వినాయక్‌‌కు లివర్ సర్జరీ ..? పరిస్ధితి అక్కడి దాకా వచ్చిందా, ఉలిక్కిపడ్డ టాలీవుడ్

ఒకప్పుడు టాలీవుడ్‌లో మాస్ డైరెక్టర్ అంటే వీవీ వినాయక్కే. హీరోయిజాన్ని అద్భుతంగా ఎలివేట్ చేయడంలో స్పెషలిస్ట్‌గా ఆయన పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా వినాయక్ సినిమాల్లోని యాక్షన్ సీక్వెన్స్‌ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఆయనతో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు క్యూకట్టేవారంటే అతిశయోక్తి కాదు. వినాయక్‌ సినిమాలతోనే ఎందరికో స్టార్‌డమ్ వచ్చింది. విజయమంటే వినాయక్ అన్నట్లుగా సాగిన ఆయన కెరీర్ తర్వాత ఎందుకో ట్రాక్ తప్పింది. వరుసపెట్టి అపజయాలు పలకరించడంతో వినాయక్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

వినాయక్ పూర్తి పేరు గండ్రోతు వీర వెంకట వినాయకరావు. సన్నిహితులు అంత పెద్ద పేరు పలకలేక వినయ్ అని పిలిచేవారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగిన వినాయక్ తను కూడా సినిమాల్లోకి వెళ్లాలనే ఉద్దేశంతో డైరెక్టర్ సాగర్ వద్ద కో డైరెక్టర్‌గా పలు చిత్రాలకు పనిచేశారు. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్‌తో ఆది సినిమా తీసే అవకాశం వినాయక్‌కు వచ్చింది. అప్పట్లో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి ఫ్యాక్షన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుండటంతో ఆయన కూడా అదే సబ్జెక్ట్ ఎంచుకుని బ్లాక్‌బస్టర్ కొట్టారు.

director vv Vinayak undergoes a major liver surgery

ఆ వెంటనే చెన్నకేశవరెడ్డి, దిల్, ఠాగూర్, సాంబ, అదుర్స్, లక్ష్మీ, కృష్ణ , ఖైదీ నెంబర్ 150 వంటి సినిమాలతో ఇండస్ట్రీలో తిరుగులేని డైరెక్టర్‌గా నిలిచారు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళిని మించి ఫాలోయింగ్ సంపాదించిన వీవీ వినాయక్.. గత కొన్నేళ్లుగా అస్సలు సినిమాలే చేయట్లేదు. మెగాస్టార్ కమ్‌బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150 హిట్ అయినా అది చిరంజీవి ఖాతాలోకి వెళ్లిపోయింది. పైగా రీమేక్ కావడంతో ఆయనకు ఏమాత్రం క్రెడిట్ దక్కలేదు.

2018లో చిరు మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌తో తెరకెక్కించిన ఇంటెలిజెంట్ తర్వాత మరే సినిమా తీయలేదు వినాయక్. తనను దర్శకుడిగా చేసిన నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు సాయిశ్రీనివాస్ హీరోగా ప్రభాస్ హిట్ మూవీ ఛత్రపతిని హిందీలో రీమేక్ చేశారు వీవీ వినాయక్. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. ఛత్రపతితో పోల్చి హిందీ ఛత్రపతిని విమర్శించారు క్రిటిక్స్. అప్పటికే ఛత్రపతిని హిందీ డబ్బింగ్‌లో అక్కడి ఆడియన్స్ చూడటం కూడా దెబ్బేసింది.

director vv Vinayak undergoes a major liver surgery

ఈ సినిమా రిజల్ట్ తర్వాత వెండితెరకు పూర్తిగా దూరమయ్యారు వీవీ వినాయక్. ఈ క్రమంలో మొన్నామధ్య బాగా చిక్కిపోయినట్లుగా ఉన్న ఆయన లుక్ బాగా వైరల్ అయ్యింది. వినయ్‌కి ఏమైంది, ఏమైనా అనారోగ్య సమస్యా అంటూ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. తాజాగా ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీవీ వినాయక్‌కి మేజర్ లివర్ సర్జరీ జరిగిందని.. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌ ఎల్‌బీ నగర్‌లోని కామినేని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లుగా పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై వినాయక్ టీమ్ కానీ, ఆయన కుటుంబసభ్యులు కానీ అధికారికంగా స్పందించలేదు. అభిమానులు మాత్రం వీవీ వినాయక్ కోలుకుని.. తిరిగి సూపర్‌హిట్ సినిమాలు తీయాలని ఆకాంక్షిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X