వివి వినాయక్ చేతిలో జాతీయ రహదారి.. నేషనల్ అవార్డుకు నామినేట్ అయిన చిత్రానికి చేయూత

దర్శకుడు నరసింహనంది దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న జాతీయ రహదారి చిత్రం థియేటర్ ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ గారి చేతులమీదుగా విడుదల చేయడం జరిగింది. భీమవరం టాకీస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో మధు చిట్టి, సైగల్ పాటిల్, మమత, ఉమాభారతి, మాస్టర్ దక్షిత్ రెడ్డి, అభి, శ్రీనివాస్ పసునూరి నటించారు. ఈ కార్యక్రమంలో కెమెరామెన్, మురళి మోహన్ రెడ్డి, సంగీత దర్శకుడు సుక్కు, ఎడిటర్ నాగిరెడ్డి, మౌనశ్రీ. సమర్పకులు, రవి కనగల ఫాల్గొన్నారు.

 Director VV Vinayak unveils Jatiya Rahadari trailer

ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు వి.వి వినాయక్ మాట్లాడుతూ... నరసింహ నంది అవార్డ్స్ సినిమాలు తీయటంలో దిట్ట. నిర్మాత రామ సత్యనారాయణ గారికి ఈ సినిమాతో అవార్డ్స్ తెచ్చుకోవాలనే కోరిక తీరుతుంది. సినిమా పెద్ద విజయం సాదించాలని కోరుకుంటూ చిత్ర యూనిట్ సభ్యులందరికీ అల్ ద బెస్ట్ అని అన్నారు..

నిర్మాత రామ సత్యనారాయణ మాట్లాడుతూ.. నేను చేసే ప్రతి సినిమా వెనుక మా వినాయక్ గారి సపోర్ట్ ఉంటుంది. ఈ జాతీయ రహదారి ప్రాజెక్ట్ గురించి చెప్పినప్పుడు నాకు మంచి సపోర్ట్ చేసారు.. ఈ ట్రైలర్‌ని వినాయక్ చేతులు మీదుగా చేయాలని మా దర్శకుడి కోరిక. వారి చేతుల మీదుగా విడుదల చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా ఫిల్మ్ ఫేర్ అవార్డ్‌కు నామినేట్ అయింది. 68వ జాతీయ అవార్డ్సులకు కూడా అప్లై చేయటం జరిగింది అని అన్నారు..

చిత్ర దర్శకుడు నరసింహ నంది మాట్లాడుతూ. నా మొదటి చిత్రం బెల్లంకొండ సురేష్ గారు విడుదల చేశారు. ఆ సమయంలో వినాయక్ ఎంతో సపోర్ట్ చేశారు. నేను పక్కా వినాయక్ అభిమానిని. ఆయన మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేయటం ఆయన గొప్పతనాని నిదర్శనం. ఈ రోజు ఆయనతతో ట్రైలర్ రిలీజ్ చేయించుకోవాలి అనే నా కోరిక తీరింది. అని అన్నారు.

నటీనటులు: మధు చిట్టి, సైగల్ పాటిల్, మమత, ఉమాభారతి, తెల్జేరు మల్లేశ్, గొట్టి మదన్, మాస్టర్ దక్షిత్ రెడ్డి, ఘర్షణ శ్రీనివాస్, అభి, నరసింహా రెడ్డి, గోవింద్ రాజు తదితరులు
సమర్పకులు: రవి కనగల
నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ
రైటర్, డైరెక్టర్: నరసింహ నంది
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: టీ ఆంజనేయులు
మ్యూజిక్: సుక్కు
డీఓపీ: మురళీమోహన్ రెడ్డి
ఎడిటింగ్: వీ నాగిరెడ్డి
లిరిక్స్: మౌనశ్రీ మల్లిక్
పీఆర్వో: మధు వి ఆర్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X