టాలీవుడ్ తెరపై విభిన్నమైన ప్రేమకథ.. గోపిచంద్ మలినేని, శ్రీకాంత్ అడ్డాల చేతుల మీదుగా!

ప్రముఖ నిర్మాణ సంస్థ ఏఆర్ మూవీ మేకర్స్ పతాకంపై *ఏ సురేష్ ప్రభు సమర్పణలో విజయ్, శీతల్ భట్ హీరో హీరోయిన్లుగా సురేష్ ప్రభు దర్శకత్వంలో ఏ.ఆర్ రాకేష్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలు జరుపుకున్నది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన దర్శకుడు గోపిచంద్ మలినేని హీరో, హీరోయిన్స్ పై తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా..నిర్మాత బెక్కం వేణుగోపాల్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో

Directors Gopichand Malineni, Srikanth Addala clapped for Love Story

చిత్ర నిర్మాత ఏఆర్ రాకేష్ మాట్లాడుతూ .. సినిమా రంగంపై ప్రేమతో చాలా రోజుల నుంచి సినిమా తీయాలనే ఆలోచనతో ఉండగా సురేష్ ప్రభు చెప్పిన కథల్లో ఈ సినిమా లైన్ వినిగానే చాలా కొత్తగా డిఫరెంట్‌గా ఉందనిపించింది. అందుకే ఈ కథని సినిమాగా తీయాలని అనుకున్నాను.ఇదే నా మొదటి చిత్రమైనా నిర్మాణ విలువలకు ఎక్కడా తగ్గకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు

చిత్ర దర్శకుడు సురేష్ ప్రభు మాట్లాడుతూ. నిర్మాత రాకేష్ గారికి కథ చెప్పిన వెంటనే విభిన్నమైన ప్రేమకథ. మనం ఈ సినిమా చేస్తున్నాం అని ఆయన చెప్పారు అందుకు ముందుగా ఆయనకు నా కృతజ్ఞతలు. ఉత్కంఠభరితంగా వెళ్లే సస్పెన్స్ థ్రిల్లర్.ఈ రోజు నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో రెగ్యులర్ షూటింగ్ జరుపు కుంటున్నాం.

చిత్రం శ్రీను మాట్లాడుతూ.. దర్శకుడు సురేష్ ప్రభు గత 13 సంవత్సరాలుగా నాకు తెలుసు తనకు సినిమా అంటే ఎంతో ప్యాషన్. తనకు నిర్మాత రాకేష్ దొరకడం నిజంగా అదృష్టం. ఇందులో నేను మంచి పాత్ర చేస్తున్నాను. నిర్మాణ బాధ్యతలు నాపై పెట్టారు. నా శక్తీ వంచన లేకుండా సహకరిస్తాను. ఈ సినిమా మా అందరికీ పెద్ద విజయం ఇవ్వాలని కోరుతున్నాను అన్నారు.

హీరో విజయ్, హీరోయిన్ శీతల్ భట్ మాట్లాడుతూ.. ఇలాంటి మంచి సినిమాలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.ఇందులో అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు. షేకింగ్ శేషు మాట్లాడుతూ.. ఇందులో నేను చేస్తున్న పాత్ర డీఫ్రెంట్ గా ఉంటుంది.మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా దర్శక, నిర్మాతలకు మంచి పేరు రావాలని కోరుతున్నాను అన్నారు.

కథా రచయిత గట్టు నరేందర్ మాట్లాడుతూ .. నేను రాసిన లైన్ దర్శక,నిర్మాతలకు నచ్చింది.సైకాలజీ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుందని అన్నారు.

నటీనటులు: విజయ్, శీతల్ భట్, శ్రీనివాస్ రెడ్డి, చిత్రం శ్రీను,రవి వర్మ, అదుర్స్ రఘు, జ్యోతి తదితరులు
సమర్పణ: సురేష్ ప్రభు
బ్యానర్: ఏ ఆర్ మూవీ మేకర్స్
ప్రొడ్యూసర్: ఏ ఆర్ రాకేష్
కో-ప్రొడ్యుసర్: విద్యా గణేష్
లైన్ ప్రొడ్యూసర్: చిత్రం శ్రీను
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్: సురేష్ ప్రభు
మ్యూజిక్: మహావీర
కెమెరా: రఫీ
మూలకథ: నరేంద్ర
రచన సహాకారం: ఎమ్. లక్ష్మణ్ బాబు, శ్రీధర్, సుంకరి మాటలు : ప్రశాంత్ శర్మ
పీఆర్వో : మధు వి.ఆర్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X