Chiranjeevi అభిమానులకు సర్‌ప్రైజ్.. తరం తరం స్థిరం చిరంజీవ అంటున్న దర్శక ద్వయం!
ఈ రోజు (ఆగస్ట్ 22) మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు. ఈ సందర్భంగా తెలుగు సినీ ప్రేక్షకాభిమానులు సహా సినీ సెలబ్రిటీలు సైతం మెగాస్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. సెలబ్రిటీలలో కొందరు సోషల్ మీడియా ద్వారా చిరంజీవికి బర్త్ డే విషెష్ చెబుతుంటే మరికొందరు కొన్ని స్పెషల్ వీడియోస్ ద్వారా తమ అభినందనలను తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో దర్శక ద్వయం రమేశ్ గోపిలు తమ అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవి కోసం ప్రత్యేకమైన ఓ వీడియో సాంగ్‌ను ట్రిబ్యూట్‌గా రూపొందించి... తమ అభిమానాన్ని చాటుకున్నారు..
''ఆకాశం వంగింది నీకై.. భూలోకం పొంగింది నీకై, అభిమాన సంద్రం నీకుంది అండ, ఇరవైలో అమ్మాయిలకైనా.. అరవైలో అమ్మమ్మలకైనా గుండెల్లో అనురాగం నింపే జెండా, నటన నీ నిచ్చెన.. నీ సాటి నువ్వే గురు, నేలకే వచ్చిన నటరాజు నువ్వే చిరు, తరం తరం స్థిరం చిరంజీవ..నరం నరం స్వరం చిరంజీవ '' అంటూ సాగే ఈ పాట ఆసక్తి రేకెత్తిస్తోంది. అంతే కాక ఈ పాటలో వివిధ సందర్భాల్లో అభిమానులు చిరంజీవి మీద చాటుకున్న వీడియోలను కూడా పెట్టారు. ఇక పాట మొత్తంలో ఒక పక్క చిరంజీవి నటన, మరో పక్క ఆయన చేసిన సేవా కార్యక్రమాలను గురించి కూడా ప్రస్తావించారు.

మేజిక్ యాక్సిస్, నౌదియాల్ మూవీ మేకర్స్ బ్యానర్స్ మీద రోషిణి నౌదియాల్ నిర్మించిన ఈ సాంగ్ ని చిర్రావూరి విజయ్ కుమార్ రచించగా హేమ చంద్ర అద్భుతంగ ఆలపించారు. ఇక శ్రీ వసంత్ ఈ పాటకు సంగీతాన్ని అందించారు. ఇక నా లవ్‌స్టోరి క్యూట్ లవ్‌స్టోరితో ప్రేక్షకులను మెప్పించిన డైరెక్టర్స్ రమేశ్ గోపి త్వరలోనే రెడ్డిగారింట్లో రౌడీయిజం వంటి లవ్ అండ్ యాక్షన్ చిత్రంతో ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. దర్శకులు రమేష్ - గోపి కలిసి రూపొందించిన ఇది నా క్యూట్ లవ్ స్టోరీ సినిమా విజయం సాధించింది.. వీరిద్దరూ కలిసి తీసిన రెడ్డి గారి ఇంట్లో రౌడీయిజం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.. వీరిద్దరి కాంబినేషన్ లో కన్నడలో రూపొందించిన మరో సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.. ఈ మధ్యనే వీరిద్దరి డైరెక్షన్ లో నాలుగో సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు.. ఈ సినిమాలో శోభన్ ను హీరోగా పరిచయం చేయనున్నారు ఈ ఇద్దరు డైరెక్టర్లు.


Click it and Unblock the Notifications











