దృశ్యం డైరెక్టర్ ఆరోగ్యం విషమం.. మరణవార్తను ఖండించిన రితేష్ దేశ్‌ముఖ్
బాలీవుడ్‌లో దృశ్యం చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించిన నిషికాంత్ కామత్ మరణించారనే వార్త మీడియాలో హల్‌చల్ రేపింది. నిషికాంత్ బతికే ఉన్నారనే విషయాన్ని తెలుసుకోలేక తప్పుడు సమాచారంతో జాతీయ మీడియా బ్రేకింగ్ అలర్ట్‌లు ఇచ్చాయి. ఆ తర్వాత అసలు విషయాన్ని తెలుసుకొని తప్పును సరిదిద్దుకోవడం గమనార్హం.
దర్శకుడు నిషికాంత్ కామత్ బతికే ఉన్నారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందుతున్నది. ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడాం. ఇంకా ఆయన పోరాటం చేస్తున్నారు. ఆయన త్వరగాకోలుకోవాలని భగవంతుడిని వేడుకొందాం అని బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్ ట్వీట్ చేశారు.

నిషికాంత్ కామత్‌తో హాస్పిటల్‌లో ఉంటున్న వ్యక్తితో ఇప్పుడే మాట్లాడాను. ఆయన బతికే ఉన్నారని చెప్పారు. పరిస్థితి విషమంగా ఉన్నప్పికీ.. చావుబతుకుల మధ్య పోరాటం చేస్తున్నారు. నిషికాంత్ సజీవంగానే ఉన్నారు అని నటి జవేరి మిలాప్ ట్వీట్ చేశారు.
నిషికాంత్ కామత్ లివర్ సిర్హోసిస్ వ్యాధితో కొంతకాలంగా బాధపడుతున్నారు. ఆయనకు ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో చికిత్స జరుగుతున్నది. ఆయన ఆరోగ్య పరిస్థితి కొద్దిరోజులుగా విషమంగా ఉన్నప్పటికీ.. చావు బతుకుల మధ్య పోరాటం చేస్తున్నారు అని వైద్యులు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











