త్రిషాకు మొండిచేయి.. ఆశలపై నీళ్లు చల్లిన విజయ్!

తమిళనాడు రాజకీయ రంగంలో ఊహించని ట్విస్టులు చోటు చేసుకొంటున్నాయి. రోజు రోజుకు కొత్త ఈక్వేషన్లు, సరికొత్త పరిణామాలతో పాలిటిక్స్ వేసవి తాపాన్ని మించి వేడి పుట్టిస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే పార్టీని గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటు ఆహ్వానించకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటుకు వామపక్ష పార్టీలు, వీసీకే పార్టీ మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముందు ఉన్న పరిణామాలు తారుమారు అవుతున్నాయి. ఈ క్రమంలోనే త్రిష వ్యవహారం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. త్రిషకు సంబంధించిన ఆసక్తికరమైన పరిణామం ఏమిటంటే?

టీవీకే అధినేత, దళపతి విజయ్‌తో భార్య విడాకుల నేపథ్యంలో తెరపైకి వచ్చిన త్రిషతో బంధం మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. భార్య పరోక్షంగా ఆరోపించిన నేపథ్యంలో త్రిష, విజయ్ మధ్య సహజీవన బంధం ఎన్నికల్లో ప్రధానం అంశంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అయితే తమ బంధం గురించి వారిద్దరూ ఎక్కడా కూడా మాట జారకుండా జాగ్రత్త పడ్డారు. అయితే విజయ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో త్రిషకు ప్రభుత్వంలో కీలక పదవి కట్టబెడుతారనే ఊహాగానం బయటకు వచ్చింది.

Disappointment for Trisha Krishnan regarding Vijay s Trichy Seat contest

అయితే తమిళ ఎన్నికల్లో వజియ్ తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్ స్థానాల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే పెరంబూర్ సీటు కొనసాగుతూ తిరుచ్చి సీటుకు రాజీనామా చేస్తారు. ఆ స్థానం నుంచి త్రిషకు అవకాశం కల్పిస్తారు. ఆమెను ఎమ్మెల్యే పోటీలో బరిలో దింపుతారనే వార్త మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే ఆ వార్త వైరల్ అవుతుండగా.. త్రిషకు కాకుండా మాజీ ఐఏఎస్ అధికారి సగాయంకు అవకాశం ఇస్తారనే వార్త బయటకు వచ్చింది.

అయితే టీవీకే పార్టీకి మాజీ అధికారి సగాయం మద్దతుగా నిలిచారు. సీనియర్ అధికారి కావడంతో పాలనపరమైన సలహాలు తీసుకోవడానికి, ఆయన అనుభవం పనికి వస్తుందనే దిశగా విజయ్ ఆలోచిస్తున్నారనే విషయం చర్చనీయాంశమైంది. దాంతో తిరుచ్చి స్థానం విషయంలో త్రిషాకు మొండిచెయ్యి చూపవచ్చని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉండగా, తిరుచ్చి స్థానం విషయంలో మరో కొత్త రూమర్ తమిళ మీడియాలో వైరల్ అయింది.

అయితే ప్రభుత్వ ఏర్పాటుకు కీలకమైన మద్దతు ఇస్తున్న వీసీకే పార్టీకి తిరుచ్చి స్థానం కేటాయించనున్నారు. ఆ డిమాండ్‌తోనే ఆ పార్టీ మద్దతు ఇస్తున్నది. కాబట్టి ఈ సీటు నుంచి త్రిష పోటీ చేయడానికి ఉన్న అవకాశం చేజారే పరిస్థితి కనిపిస్తున్నది అనే వార్త ట్రెండ్ అవుతున్నది. ఇలాంటి ఊహాగానాలతో రాజకీయ వాతావరణం మరింత ఆసక్తికరంగా మారింది. అయితే తిరుచ్చి సీటుకు రాజీనామా చేస్తే విజయ్ నిర్ణయం ఎలా ఉండబోతుందనే విషయం హాట్ టాపిక్‌గా మారింది.

Read more about: trisha krishnan vijay tvk
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X