వెంకటేష్, నాగచైతన్యలకు ధీటుగా మాస్ మహారాజ్.. పోటీ పడి మరీ!

మామా అల్లుళ్ళు వెంకటేష్, నాగచైతన్యలకు ధీటుగా మాస్ మహారాజ్ రవితేజ దూసుకుపోతుండటం ఆసక్తి కలిగిస్తోంది. గత కొంతకాలంగా సరైన హిట్ లేక డీలాపడిన రవితేజ.. 'డిస్కోరాజా'గా ఫుల్ జోష్ ప్రదర్శిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన 'డిస్కోరాజా' టీజర్ తో 'వెంకీమామ'ను ఢీ కొడుతున్నాడు.

ఓ వైపు 'డిస్కోరాజా' టీజర్, మరోవైపు 'వెంకీమామ' ట్రైలర్ యు ట్యూబ్ లో వేగంగా వ్యూస్ రాబడుతున్నాయి. పోటాపోటీగా దూసుకెళ్తూ ట్రెండ్ అవుతున్నాయి. తాజా ట్రెండింగ్ లిస్టులో 'వెంకీమామ' ట్రైలర్ మొదటి స్థానంలో ఉండగా, 'డిస్కోరాజా' టీజర్ రెండో స్థానంలో కొనసాగుతోంది. దీంతో ఈ పోటీ వాతావరణం చూసి రవితేజ అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ దెబ్బకు రవితేజకు పూర్వవైభవం ఖాయం అని చెప్పుకుంటున్నారు.

 Disco Raja Vs VenkyMama speed competition

వీఐ ఆనంద్ దర్శకత్వంలో 'డిస్కోరాజా' సినిమా రూపుదిద్దుకుంటోంది. ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రామ్ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. రవితేజ అభిమానుల టేస్ట్‌కి సరిపోయేలా ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఇప్పటికే 'డిస్కో రాజా' నుంచి విడుదలైన మొదటి పాట 'నువ్వు నాతో ఏమన్నావో' మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. సైన్స్ ఫిక్షన్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో రవితేజ సరసన నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్, ప్రియాంక జవల్కర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, సత్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. వృద్దుడిగా, యువకుడిగా ఈ సినిమాలో రవితేజ నటన అబ్బురపరచనుందని తెలుస్తోంది. జనవరి 24వ తేదీన 'డిస్కో రాజా' విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X