రోజుకు 3 లక్షల రెమ్యునరేషన్ ..నోట్ల కట్టలపైనే నిద్ర, సౌత్‌ని ఊపేసిన నటి ఎవరో తెలుసా?

చిత్ర పరిశ్రమలో డ్యాన్సర్‌గా ఎంట్రీ ఇచ్చి సూపర్‌స్టార్ ఇమేజ్ దక్కించుకున్న వారు అరుదని చెప్పాలి. ఇలాంటి ఘనతను సొంతం చేసుకున్న వ్యక్తి సిల్క్ స్మిత. మత్తెక్కించే కళ్లు, నెమలిలా మెలికలు తిరుగుతూ చేసే డ్యాన్స్, అంద చందాలతో ఒకప్పుడు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. కేవలం ఆమెను చూడటం కోసమే ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లే వారంటే అతిశయోక్తి కాదు. సిల్క్ స్మిత డేట్స్ కోసం స్టార్ హీరోలు కూడా వెయిట్ చేసేవారంటే ఆమె రేంజ్ అర్ధం చేసుకోవచ్చు.

1960 డిసెంబర్ 2న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించారు సిల్క్ స్మిత. ఆమె పూర్తి పేరు వడ్లపాటి విజయలక్ష్మీ. చాలా చిన్న వయసులోనే తల్లిదండ్రులు సిల్క్ స్మితకు వివాహం చేసేవారు. అయితే అత్తింటిలో భార్త, ఆడపడచుల వేధింపులు తట్టుకోలేక ఆమె ఇల్లు వదిలి వచ్చేశారు. మద్రాస్ వచ్చేసిన సిల్క్ స్మిత తొలుత టచ్ అప్ ఆర్టిస్ట్‌గా హీరోయిన్ అపర్ణకు పనిచేసేవారు. ఈ క్రమంలో చిన్నా చితకా రోల్స్‌లో నటించిన సిల్క్ స్మితకు.. మలయాళ దర్శకుడు ఆంటోనీ ఈస్ట్‌మన్ హీరోయిన్‌గా అవకాశం కల్పించారు. ఈ సమయంలో విజయలక్ష్మీగా ఉన్న ఆమె పేరును ఆయన స్మితగా మార్చారు.

disco shanti made sensational comments on actress silk smitha

అనంతరం తమిళ దర్శకుడు విను చక్రవర్తి , అతని భార్యలు సిల్మ్ స్మితను ప్రొత్సహించారు. ఇంగ్లీష్‌తో పాటు డ్యాన్స్ నేర్పించి ఆమె కెరీర్‌కు పునాదులు వేశారు. అనంతరం వ్యాంప్ రోల్స్, కేబ్రే డ్యాన్సర్‌గా టర్న్ అయిన సిల్క్ స్మిత మాస్‌లో విపరీతమైన క్రేజ్ దక్కించుకున్నారు. 1979లో తమిళంలో వచ్చిన వండిచక్కరమ్‌తో సిల్క్ స్మిత్ పేరు దక్షిణాదిలో మారుమోగిపోయింది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీలలో ఆమె ఐటెం సాంగ్స్ చేసి ఒక ఊపు ఊపారు.

సిల్క్ స్మిత లేని సినిమాను కొనడానికి డిస్ట్రిబ్యూటర్లు సైతం ముందుకొచ్చేవారు కాదు. 30 ఏళ్లకే 450కి పైగా సినిమాల్లో నటించారు. కానీ హీరోయిన్‌గా నటించాలన్న ఆమె కల మాత్రం నెరవేరలేదు. చిన్న వయసులోనే ఊహించని పేరు, ప్రతిష్టలు, డబ్బు వెల్లువలా పోటెత్తింది. అయినవాళ్లే మోసం చేయడం, ప్రేమ విఫలం కావడంతో మానసికంగా కృంగిపోయింది. నిర్మాతగా మారి రెండు సినిమాలు తీయగా ఆ రెండు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచాయి. దీంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన సిల్క్ స్మిత 1996 సెప్టెంబర్ 23న చెన్నైలోని తన నివాసంలోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆమె ఆత్మహత్య చేసుకోలేదని, హత్య చేశారని ఇప్పటికీ ఫిలిం సర్కిల్స్‌లో కథలు కథలుగా చెప్పుకుంటారు. చనిపోయి 28 ఏళ్లు కావొస్తున్నా సిల్క్ స్మిత మరణంపై మిస్టరీ వీడటం లేదు.

disco shanti made sensational comments on actress silk smitha

కాగా.. సిల్క్ స్మితపై ఆమె సన్నిహితురాలు, నటి డిస్కో శాంతి ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమెను తాను అక్కా అని పిలిచేదాన్నని.. తనతో అన్ని విషయాలు షేర్ చేసుకునేదని స్మిత చెప్పారు. అక్క రోజుకు లక్ష నుంచి మూడు లక్షల పారితోషికం తీసుకునేదని.. నెలకు 5 లక్షలు చెల్లిస్తూ అద్దె ఇంట్లోనే ఉండేదని తెలిపింది. చాలా విలాసవంతమైన జీవితం గడిపేదని , మంచంపై డబ్బు కట్టలను పేర్చుకుని దానిపై పడుకునేదని డిస్కో శాంతి చెప్పింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: disco shanti silk smitha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X