Just In
- 41 min ago
మెగా హీరోయిన్ ప్రాణాలకు ముప్పు: ఏకంగా పోలీసులకే వార్నింగ్ కాల్స్.. షాక్‌లో సినీ పరిశ్రమ!
- 47 min ago
నరాలు కట్ అయ్యే రూమర్.. అగ్ర దర్శకుడితో రామ్ చరణ్, యష్, ఇక ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సిందే!
- 1 hr ago
ప్రభాస్ ‘సలార్’లో విలన్‌గా సౌతిండియన్ స్టార్ హీరో: ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ యూటర్న్
- 2 hrs ago
సావిత్రి మంచిదే అయితే ఎందుకలా చచ్చింది.. అలా చేయడమే తప్పా: షకీలా సంచలన వ్యాఖ్యలు
Don't Miss!
- News
తిరుపతి అభ్యర్థిపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన: వారంలో తేల్చేస్తాం: అసెంబ్లీని ముట్టడిస్తాం
- Sports
'సిడ్నీ టెస్టు తర్వాత ద్రవిడ్ సందేశం పంపించారు.. ఆయన వల్లే మేమిలా ఆడగలిగాం'
- Finance
హీరో మోటోకార్ప్ అరుదైన ఘనత, షారూక్ ఖాన్ చేత 10కోట్లవ యూనిట్
- Lifestyle
మ్యారెజ్ లైఫ్ లో మీ భాగస్వామి ఇష్టపడే గాసిప్స్ ఏంటో తెలుసా...!
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ప్రభాస్ ‘సలార్’లో ఏకంగా ముగ్గురు: అంతా బాలీవుడ్ నుంచే అంటున్నారే!
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'రాధే శ్యామ్'. జిల్ ఫేం రాధాకృష్ణ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఇది పట్టాలపై ఉండగానే ఏకంగా మరో మూడు సినిమాలను ప్రకటించాడీ యూనివర్శల్ స్టార్ హీరో. అందులో KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రూపొందించబోయే సినిమా ఒకటి. 'రాధే శ్యామ్' తర్వాత ప్రభాస్ నటించబోయే సినిమా ఇదే కావడంతో దీనిపై అందరిలోనూ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని KGF నిర్మాణ సంస్థ హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నాడు.
'సలార్' పూర్తి మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ఎంతో క్రూరంగా ఉండబోతుందని ఫస్ట్ లుక్ పోస్టర్ చూసిన వారికి అర్థం అవుతోంది. అలాగే, అతడి ఎలివేషన్ సీన్స్ కూడా అదిరిపోయేలా రూపొందించనున్నాడట ప్రశాంత్ నీల్. ఇదిలా ఉండగా, ఈ సినిమాలో ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నట్లు తాజాగా ఓ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఈ మూవీ కోసం బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మరో ఇద్దరిని కూడా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీ కోసం తీసుకోబోయే మరో ఇద్దరు హీరోయిన్లను కూడా బాలీవుడ్‌కు చెందిన వారికే ప్రాధాన్యం ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. హిందీ మార్కెట్‌ను టార్గెట్ చేసేందుకే ఈ ప్లాన్ వేసిందట చిత్ర యూనిట్. అంతేకాదు, కీలకమైన పాత్రల కోసం కొంత మంది హిందీ నటులను తీసుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నాడట దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇక, ఈ సినిమా తెలుగు, కన్నడం, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.