దిశా పటానీ విన్యాసానికి ప్రియుడు ఫిదా.. వావ్ అంటూ లోఫర్ భామకు ప్రశంస
బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని ఫిట్‌నెస్ లెవెల్ మామూలుగా ఉండదనే విషయం అందరికి తెలిసిందే. గంటల తరబడి వర్కవుట్లతో గతంలో ఈ లోఫర్ భామ పలు వీడియోలతో అకట్టుకొన్నారు. తాజాగా ఆమె పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. వర్కవుట్ల సమయంలో తన ప్రియుడు టైగర్ ష్రాఫ్ మాదిరిగా బటర్ ఫ్లై కిక్‌ను కొట్టడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
తన ప్రియుడు, బాయ్‌ఫ్రెండ్ టైగర్ ష్రాఫ్ ఫైట్స్‌లో తనకు తాటే సాటి అని చెప్పవచ్చు. ఫ్రంట్ కిక్, బటర్ ఫ్లై కిక్ కొట్టడంలో తనకు తానే సాటి. తన ప్రియుడిని చూసి నేర్చుకొన్న దిశా పటానీ ఆ విన్యాసాన్ని ప్రదర్శించింది. రెండు కాళ్లతో కిక్ కొడుతూ ఉన్న వీడియోను పోస్టు చేసింది. బటర్ ఫ్లై కిక్ అంటూ వీడియోతోపాటు క్యాప్షన్‌ను పెట్టింది.

తన ప్రేయసి కొట్టిన బటర్ ఫ్లై కిక్కు చూసి టైగర్ ష్రాఫ్ ఫిదా అయ్యాడు. చాలా సులభంగా, క్లీన్‌గా కిక్ కొట్వావు.. వావ్ దిషు అంటూ కామెంట్ చేశారు. టైగర్ ష్రాప్ మాత్రమే కాకుండా ఆయన తల్లి కూడా దిశా పటానీని ప్రశంసలతో ముంచెత్తారు.
ఇక కెరీర్ విషయానికి వస్తే.. దిశా పటానీ ప్రస్తుతం సల్మాన్ ఖాన్‌తో కలిసి రాధే అనే చిత్రంలో నటిస్తున్నారు. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రణదీప్ హుడా కీలక పాత్రను పోషిస్తున్నారు. అలాగే ఏక్తా కపూర్ నిర్మిస్తున్న కేటీనా అనే చిత్రంలో కూడా నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











