హీరోని వదిలి పొలిటిషన్‌ని పట్టేసింది.. బయటపడ్డ హీరోయిన్ డేటింగ్ వ్యవహారం
Recommended Video
లోఫర్ భామ దిశా పటానికి వార్తల్లో నిలవడం కొత్తేమీకాదు.. ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ అందాలను ఆరబోస్తూ వార్తల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావడం ఈ అమ్మడి స్టైల్. అయితే ఈ సారి గ్లామర్ పరంగా కాకుండా, డేటింగ్ పరంగా వార్తల్లో నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేసింది దిశా. ఆమె ప్రేమాయణం మలుపు తిరిగి హీరో దగ్గరి నుంచి పొలిటిషన్ దగ్గరకు వచ్చిందట. బాలీవుడ్ సర్కిల్స్ లో ఎక్కడ చూసినా ఇదే టాపిక్ నడుస్తోంది. ఇంతకీ అసలు సంగతేంటి? ఆ హీరో ఎవరు? పొలిటిషన్ ఎవరు? వివరాల్లోకి పోతే..

హీరోయిన్ అన్నాక ఇలాంటివి కామనే కదా!
సినిమా అనే గ్లామర్ ప్రపంచంలో హీరోయిన్ అన్నాక డేటింగ్ చేయడం, ఆ తర్వాత బ్రేకప్ చెప్పేయడం లాంటివి తరచుగా జరిగేవే. బాలీవుడ్ లో అయితే ఈ కల్చర్ మరీ ఎక్కువ. ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్స్ మార్చి మార్చి వ్యక్తులను ఎంచుకుంటూ డేటింగ్ చేశారు. ఆ లిస్టులో ఇప్పుడు దిశా కూడా చేరిపోయింది.

హీరో ప్రేమలో దిశా.. డేటింగ్
బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ ప్రేమలో మునిగితేలింది దిశా పటాని. ఆయనతో ఇన్నాళ్లు దిశా నడిపిన ప్రేమ వ్యవహారం గురించి అందరికీ తెలుసు. పార్టీలు, ఫంక్షన్లు ఇలా పలు కార్యక్రమాల్లో వీరి చెట్టాపట్టాలేసుకు తిరగడాలపై బాలీవుడ్ లో పెద్ద చర్చే నడుస్తోంది. కాకపోతే ఈ ఇద్దరూ, తాము స్నేహితులమే తప్ప తమ మధ్య ఎలాంటి రిలేషన్‌షిప్ లేదని పేర్కొనేవారు. ఈ లోగా దిశా డేటింగ్ వ్యవహారం మలుపు తిరిగిందనే వార్తలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.

హీరోని వదిలి పొలిటిషన్‌తో
దిశా పటాని, టైగర్ ష్రాఫ్ విడిపోయారంటూ ప్రస్తుతం బాలీవుడ్ లో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. టైగర్ ష్రాఫ్ ని వదిలేసిన దిశా.. ఓ యంగ్ పొలిటీషియన్ తో డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమాచారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దిశా డేటింగ్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. హీరోని వదిలి పొలిటిషన్‌ని పట్టేసిందని చెప్పుకుంటున్నారు బీ టౌన్ జనం

ఆ ఫొటోలే ఆధారాలు
ఇటీవల దిశా పటాని, బాల్ థాక్రే మనవడు ఆదిత్య థాక్రే కలసి డిన్నర్ డేట్ కు వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమీయడంతో దిశా డేటింగ్ వార్తలకు మరింత బలం చేకూరింది. దీంతో బాల్ థాక్రే మనవడితో దిశా వ్యవహారం ముదిరిందని, దానికి కారణాలు ఇవే అంటూ ఓ రేంజ్ లో వార్తలు పుట్టుకొస్తున్నాయి.

స్పందించక తప్పలేదు.. మళ్ళీ అదే మాట
అయితే తనపై వస్తున్న ఈ వార్తలపై దిశాపటాని స్పందించక తప్పని పరిస్థితి నెలకొంది. కానీ ఆమె చెప్పింది రిపీటెడ్ డైలాగ్. అదే అతను నాకు స్నేహితుడు మాత్రమే అని. ''నాకు ఆదిత్య మంచి స్నేహితుడు. మా మధ్య ఇంకేమి లేదు. అసలు విషయం తెలుసుకోకుండా నాపై విమర్శలు చేసే వారి గురించి పట్టించుకునే అవసరం నాకు లేదు'' అని దిశా పటాని ఘాటుగా రియాక్ట్ అయింది.


Click it and Unblock the Notifications











