twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Project K: ప్రభాస్ సినిమాలో మరో బాలీవుడ్ బ్యూటీ.. ఆ ఫొటో రావడంతో మేటర్ లీక్

    |

    కెరీర్ ఆరంభం నుంచీ వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వచ్చినా.. పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన తర్వాత ఒక్కో ప్రాజెక్టుకు చాలా టైమ్ తీసుకుంటున్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్. 'బాహుబలి' సిరీస్ కోసం ఏకంగా ఐదేళ్లు కేటాయించిన అతడు.. ఆ తర్వాత 'సాహో' కోసం రెండేళ్లు వెచ్చించాడు. మళ్లీ చాలా గ్యాప్ తీసుకుని 'రాధే శ్యామ్'తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక, ఇప్పుడు మాత్రం వరుస పెట్టి ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఇలా ఇప్పటికే ఈ స్టార్ హీరో ఏకంగా నాలుగు సినిమాలను కూడా మొదలు పెట్టేసి షాకిచ్చాడు. దీంతో ప్రభాస్ తీరిక లేని షెడ్యూళ్లు జరుపుకుంటూ ఫుల్ బిజీగా కనిపిస్తున్నాడు.

    బాత్రూంలో శ్రీయ హాట్ సెల్ఫీ: వామ్మో తల్లైనా అస్సలు తగ్గకుండా అందాల ఆరబోతబాత్రూంలో శ్రీయ హాట్ సెల్ఫీ: వామ్మో తల్లైనా అస్సలు తగ్గకుండా అందాల ఆరబోత

    'రాధే శ్యామ్' పట్టాలపై ఉన్న సమయంలోనే రెబెల్ స్టార్ ప్రభాస్.. 'మహానటి' దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో బిగ్ బడ్జెట్ మూవీ 'ప్రాజెక్టు కే' చేస్తున్నట్లు ప్రకటించాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రానున్న ఈ సినిమాను పాన్ వరల్డ్‌ రేంజ్‌తో తీస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అందుకు అనుగుణంగానే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా కాలం పాటు జరిగింది. అలాగే, ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ కూడా ప్రారంభం అయింది. అంతేకాదు, ఇప్పటికే చిత్ర యూనిట్ హీరో ప్రభాస్, హీరోయిన్ దీపికా పదుకొనేతో పాటు కొందరు కీలక నటులతో పలు షెడ్యూళ్లను కూడా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.

    Disha Patani Onboard for Prabhas Project K Movie

    క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో భారీ బడ్జెట్‌తో రూపొందనున్న 'ప్రాజెక్టు కే' సినిమాలో బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు ఉన్న ఎంతో మంది నటీనటులు భాగం కాబోతున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనేను.. సైంటిస్ట్ పాత్ర కోసం బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌ను తీసుకున్నారు. అలాగే, వీళ్లతో పాటు మరికొందరు స్టార్లు కూడా నటిస్తారని అన్నారు. ఈ క్రమంలోనే కొంత మంది హీరోయిన్ల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో ఎంతో ముఖ్యమైన పాత్ర కోసం బాలీవుడ్ భామ దిశా పటానీని తీసుకుంటున్నారని అధికారికంగా తేలిపోయింది.

    Neil Kitchlu: కొడుకు ఫొటోతో కాజల్ బిగ్ సర్‌ప్రైజ్.. నీల్ కిచ్లూ ఎలా ఉన్నాడో చూశారంటే!Neil Kitchlu: కొడుకు ఫొటోతో కాజల్ బిగ్ సర్‌ప్రైజ్.. నీల్ కిచ్లూ ఎలా ఉన్నాడో చూశారంటే!

    సైన్స్ ఫిక్షన్ కథతో విజువల్ వండర్‌గా రూపొందనున్న 'ప్రాజెక్టు కే' మూవీలో దిశా పటానీ భాగం అయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడిస్తూ ఓ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో స్టోరీగా పెట్టుకుంది. అందులో ఈ సినిమాకు సంబంధించిన నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఆమెకు స్వాగతం పలుకుతూ ఓ ఫ్లవర్ బొకేను పంపించింది. అందులో 'డియర్ దిశా.. ప్రాజెక్టు కేలోకి నీకు స్వాగతం. మీరు ఇందులో భాగం అయినందుకు సంతోషిస్తున్నాము' అని ఓ నోట్ కూడా ఉంది. ఇక, దీనికి దిశా పటానీ లవ్ సింబల్స్‌తో వాళ్లకు రిప్లై ఇచ్చింది. ఇదిలా ఉండగా.. ఇందులో ఆమె చేసే పాత్ర కాసేపే కనిపించినా.. ఎంతో ప్రభావాన్ని చూపించే విధంగా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది.

    Disha Patani Onboard for Prabhas Project K Movie

    ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న 'ప్రాజెక్టు కే' సినిమా టైమ్ మెషీన్ ఆధారంగా తెరకెక్కనున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇందులో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అత్యంత ముఖ్యమైన సైంటిస్ట్ పాత్రను చేస్తున్నట్లు తెలుస్తోంది.

    English summary
    Pan India Star Prabhas Doing Project K Movie Under Nag Ashwin Direction. Now Disha Patani Onboard for This Movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X