VD 13: విజయ్ దేవరకొండతో మరో బ్యూటీ.. అలా లీకైన క్రేజీ న్యూస్
టాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే హిట్లు మీద హిట్లు కొట్టి తన రేంజ్ భారీగా పెంచుకున్నాడు క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం ఫ్లాపుల పరంపరతో ఇబ్బందులు పడుతున్నాడు. దీనికితోడు గత ఏడాది వచ్చిన 'లైగర్'తో బిగ్గెస్ట్ డిజాస్టర్‌ను చవి చూశాడు. అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు తన 13వ చిత్రాన్ని పరశురాం పెట్లతో చేస్తున్నాడు. హిట్ కాంబినేషన్ కావడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.
విజయ్ దేవరకొండ 'ఖుషి' మూవీ షూటింగ్ జరుపుకుంటూ ఉండగానే.. తన 12వ సినిమాను 'జెర్సీ' ఫేం గౌతమ్ తిన్ననూరితో చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇది ఇంకా మొదలు కాకముందే అతడు తన 13వ చిత్రాన్ని పరశురాం పెట్ల దర్శకత్వంలో చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు. తాజాగానే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను కూడా మొదలు పెట్టారు. దీన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని కూడా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ న్యూస్ లీకైంది.

'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విజయ్ - పరశురాం కాంబోలో రాబోతున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇక, ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటిస్తున్నట్లు తాజాగా తెలిసింది. ఆమె ఎవరో కాదు.. క్యూట్ లుక్స్‌తో కవ్వించే దివ్యాన్షా కౌశిక్. తాజాగా ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని ఆమె కన్ఫార్మ్ చేసింది. ఇక, ఇందులో ఆమె పాత్రకు కూడా మంచి ప్రాధాన్యత ఉంటుందని, దివ్యాన్షాపై సీన్స్ అన్నీ విజయ్ దేవరకొండతో కలిసి ఫారెన్‌లో షూట్ చేస్తారని తెలుస్తోంది.

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాకు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి 'ఫ్యామిలీ స్టార్' అనే పేరు పరిశీలనలో ఉంది. ఈ మూవీని సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











