‘అఖండ’ నుంచి అదిరిపోయే న్యూస్: నందమూరి ఫ్యాన్స్‌కు ఒకేరోజు రెండు పండుగలు ఖాయం

కొంత కాలంగా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తున్నా.. ఒక్కటంటే ఒక్క విజయాన్ని కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయారు టాలీవుడ్ లెజెండ్ నటసింహా నందమూరి బాలకృష్ణ. అయినప్పటికీ ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్తూనే ఉన్నారు. కానీ, ఈ సీనియర్ హీరోకు సక్సెస్ మాత్రం సొంతం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా హిట్ ట్రాక్ ఎక్కాలని నటసింహా పట్టుదలతో ఉన్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఆయన 'అఖండ' అనే సినిమాను చేస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

హిట్ కోసం ‘అఖండ'గా బాలయ్య

హిట్ కోసం ‘అఖండ'గా బాలయ్య

ఫ్లాపుల మీద ఫ్లాపులతో ఇబ్బంది పడుతోన్న నందమూరి బాలకృష్ణ.. టాలీవుడ్ బడా దర్శకుడు బోయపాటి శ్రీనుతో 'అఖండ' అనే సినిమా చేస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా చేస్తోంది. పూర్ణ, శ్రీకాంత్ ఇందులో నెగెటివ్ రోల్స్ చేస్తున్నారు. ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చుతున్నాడు.

 తొలిసారి అలాంటి పాత్రను చేస్తూ

తొలిసారి అలాంటి పాత్రను చేస్తూ

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'అఖండ' మూవీ కోసం బాలకృష్ణ ఎన్నో సాహసాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ సినిమా కోసం ఆయన ఏకంగా అఘోరాగా కనిపించబోతున్నారు. తద్వారా ఈ తరహా పాత్రను పోషిస్తోన్న ఏకైక స్టార్ హీరోగా నిలిచారు. ఇక, ఈ మూవీలో బాలయ్య కొన్ని రియల్ స్టంట్స్ కూడా చేసినట్లు తెలుస్తోంది. దీంతో సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది.

 భారీ రికార్డులతో సత్తా చాటిన మూవీ

భారీ రికార్డులతో సత్తా చాటిన మూవీ

కొద్ది రోజుల క్రితం 'అఖండ' నుంచి టైటిల్ రోర్ వీడియో విడుదలైంది. ఎంతో పవర్‌ఫుల్‌గా ఉన్న ఈ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఈ వీడియో ఎన్నో రికార్డులను తిరగరాసింది. అంతేకాదు, వేగంగా యాభై మిలియన్లు దాటిన టీజర్‌గా టాలీవుడ్‌లో చరిత్ర సృష్టించింది. సీనియర్ హీరోల చిత్రాల్లో సౌతిండియాలో టాప్‌లో నిలిచింది.

 భారీ అంచనాలు... బిజినెస్ కూడా

భారీ అంచనాలు... బిజినెస్ కూడా

ఆరంభంలో 'అఖండ' సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. కానీ, రెండు టీజర్లు విడుదలైన తర్వాత అవి అమాంతం పెరిగిపోయాయి. దీంతో ఈ సినిమాను కొనేందుకు చాలా మంది బయ్యర్లు ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి. అలాగే, శాటిలైట్ డిజిటల్ రైట్స్‌కు అత్యధిక రేటు వచ్చిందట.

దీపావళి రోజు స్పెషల్ సర్‌ప్రైజ్‌తో

దీపావళి రోజు స్పెషల్ సర్‌ప్రైజ్‌తో

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'అఖండ' మూవీ షూటింగ్ ఇటీవలే పూర్తైంది. ఆ వెంటనే బాలయ్య తన తదుపరి ప్రాజెక్టులపై ఫోకస్ చేశారు. ఇక, ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాను దీపావళి రోజున ఓ స్పెషల్ సర్‌ప్రైజింగ్ అనౌన్స్‌మెంట్ రాబోతుందని తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది.

Recommended Video

Natyam Movie Review By Nandamuri Balakrishna
దానికి సంబంధించిన ప్రకటనేనా?

దానికి సంబంధించిన ప్రకటనేనా?

రెండు భారీ హిట్ల తర్వాత బాలయ్య - బోయపాటి శ్రీను కలయికలో రాబోతున్న 'అఖండ' మూవీ నుంచి దీపావళి రోజున వచ్చే అప్‌డేట్.. ఈ సినిమా రిలీజ్ డేట్ గురించే అయి ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో మరో సాంగ్‌ను విడుదల చేయబోతున్నారేమో అన్న కామెంట్ కూడా వినిపిస్తోంది. మొత్తానికి ఈ సర్‌ప్రైజ్‌తో ఫ్యాన్స్‌కు రెండు పండుగలు రాబోతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X