‘చచ్చిపోవాలని ఉంది.. జీవితంపై ఆశ లేదు’.. నటుడు మురళీధర్ సంచలన నిర్ణయం
డీజే టిల్లు సినిమాతో కెరియర్లో బ్రేక్ అందుకున్నారు సీనియర్ నటుడు మురళీధర్ గౌడ్. టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్దు జొన్నలగడ్డ కు తండ్రి పాత్రను పోషించి తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఈ చిత్రంలో మురళీధర్ గౌడ్ తన పాత్రకు 100 శాతం న్యాయం చేశారు. టిల్లు, మురళీధర్ గౌడ్ మధ్య సాగిన సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి ఆకట్టుకున్నాయి. 2022లో విడుదలైన చిత్రం తర్వాత మురళీధరుకు మంచి గుర్తింపు దక్కింది. తన నటనకు ప్రశంసలు కూడా అందాయి.
మొదటి హిట్ డీజే టిల్లు రూపంలో అందడంతో ఆయన కెరియర్ కు పుష్ దొరికింది. ఇక అప్పటినుంచి వరుస చిత్రాలతో వెండితెరపై వెలుగుతున్నారు. ఇంట్రెస్టింగ్ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటున్నారు మురళీధర్. డిజె టిల్లు తర్వాత ఏకంగా 20 సినిమాల వరకు నటించి ఉన్నారు. రీసెంట్ గా విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో అలరించారు. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కు తండ్రి పాత్రలో నటించి కడుపుబ్బ నవ్వించారు. తన నటనతో ఆకట్టుకున్నారు.

అయితే మురళీధర్ ప్రస్తుతం మరిన్ని చిత్రాల్లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఆయన సినిమాలకు సంబంధించిన షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన టీవీ ఛానల్ కు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. జబర్దస్త్ నటి వర్ష యాంకర్ గా ఆ చానల్లో కొత్త టాక్ షో ప్రారంభమైంది. కిసిక్ టాక్స్ విత్ వర్ష అనే టైటిల్ తో కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటికే ఈ షోకు బుల్లితెర నటీనటులు హాజరై తమ వ్యక్తిగత విషయాలను కూడా నిర్మాణ మాటగా పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే మురళీధర్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు.
జబర్దస్త్ వర్ష టాక్ షోలో మాట్లాడుతూ సంచలన కామెంట్లు చేశారు. కెరియర్ లో ఇప్పుడు పీక్స్ టైంలో ఉన్న ఆయన నోట వినకూడని మాటలు వినడంతో అభిమానులు అప్సెట్ అవుతున్నారు. ఆయన శ్రేయోభిలాషులు కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే మురళీధర్ తాజాగా వర్షా టాక్ షోలో మాట్లాడుతూ తనకు జీవితం పై పెద్దగా ఆశగా లేదని చెప్పారు. దేవుడు ప్రత్యక్షమై ఏదైనా కోరుకోమని అడిగితే వెంటనే చావును కోరుకుంటాను అని చెప్పడం షాకింగ్ గా మారింది.
ప్రస్తుతం సినిమా పరిశ్రమలో మంచి అవకాశాలను అందుకుంటున్న మురళీధర్ గౌడ్ కు జీవితంలో పెద్దగా ఆశ లేదని చెప్పడం ఆయన శ్రేయోభిలాషులను బాధపడుతుంది. ఇక నీకు డబ్బు పైన, బంధాల పైన కూడా పెద్ద పట్టింపులు ఉండవని చెబుతున్నారు. అయితే మురళీధర్ తన జీవితంలో ఎన్నో కష్టాలను దాటి వచ్చారని చెప్పుకొచ్చారు. చూడాల్సినవన్నీ చూసేసాను అని ఇక తన జీవిత కర్తవ్యంగా ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని, ఆ క్రమంలో చావు కైనా వెనుకాడనని అన్నారు. ఈయన సిద్దిపేట జిల్లా రామాయంపేట గ్రామానికి చెందినవాడు కావడం విశేషం. హైదరాబాదులో ని మింట్ కాంపౌండ్ లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ గా విధులు నిర్వహించారు. ఇక ప్రస్తుతం సినిమాల్లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈయన 'రంగస్థలం' చిత్రం నుంచి వెండితెరపై కనిపిస్తున్నారు. తాజాగా 'మ్యాడ్ స్క్వేర్' చిత్రంతో థియేటర్లలో సందడి చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











