అలీని ఆటాడుకున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.. ఊహించుకోలేం అంటూ కేకలు

తెలుగు చిత్ర సీమలో ఉన్న టాప్ కమెడియన్లలో అలీ ఒకరు. నాలుగున్నర దశాబ్ధాలుగా ప్రేక్షకులను తనదైన హాస్యంతో కడుపుబ్బా నవ్విస్తున్నారు అలీ. ఆయన పేరు చెప్పగానే చిత్ర విచిత్ర భాష, వింత శబ్ధాలు కళ్ల ముందు మెదులుతాయి. జంధ్యాల చిత్రాల్లో చిన్న చిన్న వేషాలు వేసిన అలీ.. తర్వాతి కాలంలో ఎస్వీ కృష్ణారెడ్డి, ఈవీవీ సత్యనారాయణ లాంటి దర్శకుల చేతిలో పడి మరింత రాటుదేలాడు. ఇక పూరీ జగన్నాథ్ ఎంట్రీతో అలీ గెటప్స్ పూర్తిగా మారాయి. అలీని లక్కీ హ్యాండ్‌గా భావించే పూరి.. తన సినిమాలలో ఖచ్చితంగా ఓ క్యారెక్టర్ రాస్తారు.

ఎంతో మంది కొత్త కమెడియన్లు ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నా.. అలీకి మాత్రం క్రేజ్ తగ్గలేదు. ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తూ , కాలానికి తగినట్లుగా తనను తాను మార్చుకుంటున్నారు అలీ. ఓ వైపు సినిమాలు చేస్తూనే బుల్లితెరపై హోస్ట్‌గానూ బిజీగా ఉన్నారు. అంతేకాదు.. రాజకీయాలంటే అలీకి చాలా ఇష్టం. తెలుగుదేశం పార్టీకి తొలి నుంచి గట్టి మద్ధతుదారుడిగా ఉన్న ఆయన మూడు దశాబ్థాలు టీడీపీకి సేవలందించారు.

Do a movie with Pawan fans ask comedian ali at double ismart trailer launch

రాజమండ్రి, విజయవాడ వెస్ట్, గుంటూరు వెస్ట్ నుంచి అలీ పోటీ చేస్తారంటూ ఎన్నోసార్లు ప్రచారం జరిగింది .. కానీ ఇదంతా ప్రచారంగానే కొట్టిపారేసేవారు. అయితే ఏమైందో ఏమో కానీ 2019 ఏపీ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి అనూహ్యంగా వైసీపీలో చేరారు అలీ. ఆ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున విస్తృతంగా ప్రచారం చేశారు. ఆయన సేవలను గుర్తించిన జగన్.. ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పోస్ట్ కట్టబెట్టారు.

అయితే రాజకీయాలు ఎంతటి ప్రాణ స్నేహితులనైనా బద్ధ శత్రువులుగా మార్చేస్తాయి అంటారు. ఇండస్ట్రీలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో అత్యంత సన్నిహితంగా ఉంటారు అలీ. పవన్ నటించే సినిమాలో అలీ తప్పకుండా ఉంటారు. అలాంటి ప్రాణ స్నేహితుడు జనసేన పార్టీని పెట్టి వైసీపీపై పోరాడుతూ ఉంటే అలీ ఏకంగా జగన్‌కు జైకొట్టడం కలకలం రేపింది. అంతేకాదు.. జనసేనపై తీవ్ర విమర్శలు చేయడంతో పవన్ ఫ్యాన్స్ అలీపై మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలు కావడంతో అలీ రాజకీయాలకు ఫుల్‌స్టాప్ పెడుతున్నట్లు ప్రకటించారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్‌కు అలీ ఆల్ ది బెస్ట్ చెప్పారు.

Do a movie with Pawan fans ask comedian ali at double ismart trailer launch

అయితే పవన్ - అలీలు అన్నీ మరిచిపోయి గతంలో మాదిరిగా సినిమాలు చేయాలని అభిమానులు కోరుతున్నారు. తాజాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన డబుల్ ఇస్మార్ట్‌లో అలీ నవ్వించేందుకు సిద్ధమయ్యారు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం విశాఖపట్నంలో జరిగింది. ఈ ఈవెంట్‌కు అలీ హాజరవ్వగా.. ప్రేక్షకుల్లోని పవన్ కళ్యాణ్ అభిమానులు ఈలలు వేస్తూ , కేకలు వేశారు. వారిలో ఒక వ్యక్తి యాంకర్ వద్ద మైక్ లాక్కొని .. సార్ మీరు పవన్ కళ్యాణ్‌తో సినిమా ఎప్పుడు చేస్తారని ప్రశ్నించాడు.

మీరు లేకుండా పవర్ స్టార్ సినిమాను ఊహించుకోవడం చాలా కష్టంగా ఉంది సార్.. పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలూకాలో మీరు జాయిన్ అవ్వాలి , మీరు మళ్లీ పవన్ కళ్యాణ్‌తో సినిమాలు తీయాలని కోరాడు. దీనికి అలీ థంప్స్‌ అప్ చూపిస్తూ , చిరునవ్వులు చిందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అక్కడా పవన్ అభిమానులు ఇదే క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. అభిమానుల కోరికను మన్నించి వీరిద్దరూ సినిమా తీయాలని ఆకాంక్షిద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X