Brahmanandam: బ్రహ్మానందానికి ఇష్టమైన మూవీ ఏంటో తెలుసా? ఎవ్వరూ ఊహించలేరు!
హాస్య బ్రహ్మ.. బ్రహ్మానందం గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన గత మూడు జనరేషన్లను తన నటనతో..హాస్యంతో నవ్విస్తూనే ఉన్నారు. ఇక ఎంతో మంది కమెడియన్స్ వస్తారు.. వెళ్తారు కానీ.. బ్రహ్మానందం ఎవర్ గ్రీన్ కమెడియన్ అని చెప్పవచ్చు. ఆయన పాపులారిటీ అంతా ఇంతా కాదు... ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా.. ఆయన ఫన్నీ జోక్స్, మీమ్స్ కనిపిస్తాయి. ఇక ఇటీవల ఆయన కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం కీడా కోలా. ఇక ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే...
సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది కమెడియన్స్ వస్తారు.. వెళ్తారు.. కానీ బ్రహ్మానందం క్రేజ్ వేరే లెవెల్. ఎంతో మంది కమెడియన్స్ వచ్చి ఫెడ్ అవుట్ అయినా సరే.. బ్రహ్మానందం తన నటన, హాస్యంతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. ఇక ఆయన ఎవర్ గ్రీన్ గా టాలీవుడ్ లో నిలిచిపోయారు. ఇక ఆయన ఇటీవల సినిమాల్లో కనిపించడం తగ్గించిన విషయం తెలిసిందే. ఏవో కొన్ని సినిమాల్లో మాత్రమే అలా కనిపిస్తూ వస్తున్నారు.

ఇటీవల బ్రహ్మానందం రంగ మార్తండ అనే సినిమాలో నటించారు. ఆ సినిమాలో ఆయన రోల్ ప్రత్యేకం. కామెడియన్ పాత్రలో కాకుండా.. తన నటనతో అందరినీ ఏడిపించేశాడు. ఇక కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.. ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత ఆయన ఫుల్ లెంగ్త్ లో నటిస్తున్న చిత్రం కీడా కోలా. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.
ఇక కీడాకోలా చిత్రంలో బ్రహ్మానందం పాత్ర స్పెషల్ గా ఉంటుందని ఇప్పటికే దర్శకుడు తరుణ్ భాస్కర్ చెప్పుకువచ్చాడు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ కూడా విచిత్రంగా మొదలు పెట్టింది చిత్రబృందం. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆయన.. తన గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చెప్పుకువచ్చారు. ఓ ఇంటర్వ్యూలో తనకు ఇష్టమైన సినిమా ఏంటో వెల్లడించారు. ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బ్రహ్మానందాన్ని.. మీకు ఇష్టమైన సినిమా ఏంటి అని అడిగారు. దీంతో ఆయనకు ఎవరూ ఊహించని ఆ సినిమా అంటే తెగ ఇష్టమట. అయితే ఆ చిత్రంలో బ్రహ్మీ కూడా నటించలేదు. అయినా.. ఆ సినిమా అంటే తనకు బాగా ఇష్టమంట. ఇంతకీ ఆ సినిమా ఏంటనే కదా మీ ఆలోచన.. విజయ్ దేవరకొండ నటించిన పెళ్లి చూపులు సినిమా అంటే తనకు బాగా ఇష్టం అంట. ఇక రీతు వర్మ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
పెళ్లి చూపులు సినిమా బ్రహ్మానందానికి చాలా ఇష్టమంట. ఎప్పుడు టైం దొరికినా.. ఈ సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తాడట. దీంతో బ్రహ్మానందం ఇలాంటి మూవీని ఇష్టపడతారా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











