మొన్న బిగ్‌బాస్, నిన్న వెబ్ సిరీస్.. ఈరోజు మరో అద్భుతమైన సినిమా.. శివాజి అస్సలు తగ్గట్లేడుగా!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కంటెస్టెంట్ గా వచ్చి అద్బుతమైన ఆట కనబర్చిన శివాజి గురించి అందరికీ తెలిసిందే. గతంలో ఎన్నెన్నో అద్భుతమైన సినిమాలు చేసిన ఇతగాడు.. బిగ్ బాస్ షో ద్వారానే మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కేవలం సినిమాల్లో నటననే అదరగొట్టకుండా.. తన క్యారెక్టర్ ను కూడా అలాగే అందరికీ చూపించి మంచి మార్కులే కొట్టేశాడు. ప్రతీ ఒక్కరికి శివాజి.. శివన్నలా మారిపోయాడు. అయితే చాలా కాలం తర్వాత శివాజి మరోసారి అద్భుతమైన సినిమా ద్వారా రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. అయితే ఆ సినిమా ఏంటి, అందులో హీరోయిన్ ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1997లో మాస్టర్ సినిమా ద్వారా తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టిన ఇతడు.. ఆ తర్వాత అనేక అద్భుతమైన చిత్రాలతో వచ్చి అందరినీ అలరించాడు. ముఖ్యంగా శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి, ప్రేమంటే ఇదేరా, ఫిల్మ్ నగర్, యువరాజు, బ్రహ్మచారులు, కళాశాల, ప్రియమైన నీకు, కుషీ, భార్య, చిరంజీవులు, స్నేహితుడు, ఫ్రెండ్స్, ప్రియనేస్తమా, చంద్రవంశం, స్నేహితులు, మనసుంటే చాలు, సందడే సందడి, అదృష్టం, ఇంద్రుడు, శివ రామరాజు ఇలా అనేక సినిమాల్లో నటించాడు. ఒట్టేసి చెబుతున్నా, ఆయుధం, శ్రీరామచంద్రులు, మిస్సమ్మ, అదిరిందయ్యా చంద్రం, టాలా బిర్లా మధ్యలో లైలా, మంత్ర బ్రహ్మ లోకం టు యమలోకం వయా భూలోకం, అయ్యారే, పవిత్ర, బూచమ్మ బూచోడు వంటి బ్లాక్ బస్టర్ హిట్టు చిత్రాల్లో కూడా నటించాడు.

Do You Know Actor Sivaji Re Entry Movie Name And Who is The Heroine In This Film

అయితే ఆ తర్వాత సినిమాలకు దూరం అయ్యాడు. ఇంతకాలం పాటు అయనను తెరపై ఒక్కసారి కూడా కనిపించలేదు. కానీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షోలోకి ఎంట్రీ ఇచ్చి మరోసారి తెరపై కనిపించాడు. ఈ షోతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుని మరోసారి హీరో అయ్యాడు. ఇక ఈ షో నుంచి వచ్చిన వెంటనే ఆయన నటించిన #90స్ వెబ్ సిరీస్ విడుదల కావడం.. అందులో శివాజి నటనకు మంచి మార్కులు పెరగడంతో ఆయనకు మరింత క్రేజ్ పెరిగింది. బుల్లితెరపై ఆయన్ను చూసిన ప్రతీ ఒక్కరూ ఆయన తాజా వెబ్ సిరీస్ ను చూసి ఫుల్ గా ఎంజాయ్ చేశారు.

అయితే ఈయన వెబ్ సిరీస్ కు వచ్చిన రెస్పాన్స్ చూసిన ఆయన సినిమాల్లో నటించేందుకు ఫిక్స్ అయ్యాడు. అలాగే ఆయనకు మంచి అవకాశం రావడంతో తెలుగు రంగంలోకి మరోసారి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో రాబోతున్న కూర్మ నాయకి అనే సినిమా ద్వారా రాబోతున్నారు. ఈ చిత్రంలో మరో ప్రధాన పాత్రలో శివాజి కనిపించబోతున్నట్లు ఆయన తాజాగా వివరించాడు. తన యూట్యూబ్ ఛానెల్ వేధికగా ఈ విషయాన్ని వెల్లడించాడు. అయితే వీడియోలో ఆయన మాట్లాడడానికి ముందుగానే కూర్మ నాయకి సినిమా పోస్టర్ ను చూపించాడు.

Do You Know Actor Sivaji Re Entry Movie Name And Who is The Heroine In This Film

అందులో వరలక్ష్మీ శరత్ కుమార్ చాలా విభిన్నంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ పోస్టర్ చూస్తుంటేనే సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. అయితే త్వరలోనే ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన లుక్ ను విడుదల చేస్తామని... అనేక విషయాల గురించి చర్చించుకుందామని కూడా అన్నారు. ఈ సినిమాను రోహన్ ప్రొడక్షన్ బ్యానర్ పై.... హర్ష వర్ధన్ కడియాలా దర్శకత్వం వహిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X