VI Anand: అల్లు అర్జున్‌తో ఊరుపేరు భైరవకోన డైరెక్టర్ కొత్త సినిమా.. ఎలాంటి కథ అంటే?

సందీప్ కిషన్ హీరోగా రాబోతున్న కొత్త చిత్రం ఊరుపేరు భైరవకోన. ఈ సినిమాకు వీఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 16వ తేదీన ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అనిల్‌ సుంకర సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేశ్‌ దండా నిర్మించిన ఈ సినిమాపై పెద్ద ఎత్తునే అంచనాలు నమోదు అయ్యాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ వీఐ ఆనంద్ షాకింగ్ కామెంట్లు చేశారు. తన నెక్స్ట్ సినిమా గురించి వివరించారు.

ముఖ్యంగా దర్శకుడు వీఐ ఆనంద్... స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయాలనుకుంటున్నట్లు.. వివరించారు. అి ఎలాంటి జానర్.. నెక్స్ట్ ఆయన చేసే సినిమాలు ఏంటి, అల్లు అర్జున్ తో ఎలాంటి సినిమా చేస్తున్నారు, ఎప్పుడు పట్టాలెక్కనుంది వంటి విషయాల గురించి వివరించారు. ఈ కథనంలో ఆ పూర్తి వివరాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Do You Know Allu Arjun And VI Anand Combo Movie Genre Check Details

తాజాగా ఊరుపేరు భైరవకోన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వీఐ ఆనంద్.. చాలా కాలంగా తాను అల్లు అర్జున్ తో కలిసి ఓ సినిమా చేయాలని అనుకుంటున్నారట. అయితే అది మాత్రం వాయిదా పడుతూ వస్తోందట. ముఖ్యంగా చాలా స్టోరీలను అనుకున్నప్పటికీ.. ఒక్కటి కూడా వర్క్ కాలేదని.. దాంతో తామిద్దరి కాంబోలో సినిమా రాలేదని వీఐ ఆనంద్ చెప్పుకొచ్చారు.

అయితే సైన్స్- ఫిక్షన్ జానర్ లో ఈ సినిమాలని అనుకుంటున్నామని... కానీ ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందని మాత్రం తనకు తెలియదని అన్నారు. భవిష్యత్తులో మాత్రం ఈ సినిమా కచ్చితంగా కార్యరూపం దాల్చే అవకాశం ఉందని వివరించారు. అలాగే తన నెక్స్ట్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ.. ఇప్పటికే పలు సినిమాలకు సైన్ చేసినట్లు వెల్లడించారు. ముఖ్యంగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఓ సినిమా చేయాల్సి ఉందని వెల్లడించారు.

Do You Know Allu Arjun And VI Anand Combo Movie Genre Check Details

అయితే ఈ సినిమాలో హీరోగా.. యంగ్ అండ్ డైనమిక్ హీరో నిఖిల్ సిద్దార్థను తీసుకున్నారని కూడా వివరించారు. గీతా ఆర్ట్స్, వీఐ ఆనంద్, నిఖిల్ సిద్దార్థల కాంబోలో రాబోతున్న ఈ సినిమా.. ఊరుపేరు భైరవకోన చిత్రం రిలీజ్ అయిన తర్వాత త్వరలోనే పట్టాలెక్కతుందని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X