బన్నీ- సుక్కు కాంబోలో మిస్ అయిన మూవీ.. ఆ సినిమా అల్లుఅర్జున్ తో పడి ఉంటే..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ప్రతి మూవీ సెన్సేషనల్ హిట్టే. ఇండస్ట్రీలో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ.. సక్సెస్ పుల్ కాంబో గా మంచి గుర్తింపు తెంచుకుంది. ఇక పుష్ప సినిమాతో వీరి క్రేజీ కాంబినేషన్ కు మరింత పాపులారిటీ పెరిగింది. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో రావాల్సిన ఓ సూపర్ హిట్ మూవీ మిస్సయిందట. ఇంతకీ ఆ మూవీ ఏంటి ? వీరిద్దరి కాంబినేషన్ మ్యాచ్ కాకపోవడానికి కారణాలేంటి వివరాల్లోకెళ్తే..
అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ లో ఇప్పటిది కాదు. వీరిద్దరి కాంబోలో తొలిసారి 'ఆర్య' మూవీ తెరకెక్కంది. అల్లు అర్జున్ కెరీర్ కు మంచి బ్రేక్ ఇచ్చిన మూవీ 'ఆర్య'. ఈ సినిమా కేవలం అల్లు అర్జున్ కే కాదు.. సుకుమార్ కెరీర్లో ఓ మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. వన్ సైడ్ లవ్ అంటూ సరికొత్త కాన్సెప్టుతో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దీంతో బన్నీకి ఎక్కడ లేని స్టార్ డమ్ అందుకుంది. ఇలా ఆర్య సినిమాను నుంచి పుష్ప వరకూ సాగిన ప్రయాణంలో ఎన్నో హీట్స్ అందుకున్నారు. ఇందులో పుష్ప 1 ఎలాంటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.

ఇండియన్ ఫీల్మి ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది ఈ మూవీ. ఈ సక్సెస్ఫుల్ మూవీకి సీక్వెల్ గా వచ్చిందే పుష్ప 2. ఫ్యాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన ఈ మూవీ నేడు డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. దాదాపు 12,500 స్క్రీన్ లలో ప్రదర్శించబడింది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ చరిత్రలోనే తొలిసారిగా అత్యధిక స్క్రీన్ లలో ప్రదర్శించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది పుష్ప 2. దాదాపు రూ. 500 కోట్లతో నిర్మించిన ఈ భారీ బడ్జెట్ మూవీ.. రిలీజ్ కు ముందే రూ. 1000 కోట్ల కు పైగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసి సెన్సేషన్ ను క్రియేట్ చేసింది.
అంతేకాకుండా ఓవర్సీస్ లో అత్యధిక వేగంగా 1 మిలియన్ టికెట్లు అమ్ముడుపోయిన సినిమాగా కూడా పుష్ప 2 సరికొత్త రికార్డును సృష్టించింది. అలాగే. బుక్ మై షో లో అత్యధిక వేగంగా 1 మిలియన్ టికెట్లు అమ్ముడు పోయిన సినిమాగా కూడా నిలించింది. ఇప్పటికే పాజిటివ్ టాక్ అండ్ పాజిటివ్ రివ్యూ సొంతం చేసుకున్న పుష్ప 2 మూవీ తొలి రోజు 300 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇదంతా సుకుమార్- అల్లు అర్జున్ కాంబినేషన్ ఫలితమే. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఏ మూవీ అయినా సక్సెస్ కావాల్సిందే. అలాంటి క్రేజీ కాంబోలో 'జగడం' అనే మూవీ మిస్ అయిందట. జగడం మూవీకి సుకుమార్ డైరెక్షన్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో తొలి అల్లు అర్జున్ ను హీరోగా సెలక్ట్ చేశారంట. కానీ, అన్ని సిద్ధమయ్యాక దిల్ రాజుతో చిన్న సమస్య వచ్చిందని, దీంతో కోపం పట్టలేకపోయానని సుకుమార్.. వెంటనే రామ్ దగ్గరు వెళ్లిపోయి సోర్టీ చెప్పి ఓకే చేయించానని తెలిపారు. దీంతో రామ్ పోతినేని హీరోగా నటించారు.
అయితే ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న.. మాస్ ఆడియన్స్ ఆదరించిన బాక్స్ ఆఫీస్ వద్ద సరైన రెస్పాన్స్ సొంతం చేసుకోలేకపోయింది. కలెక్షన్ల రేసులో వెనుకబడింది. దీంతో సుకుమార్ కెరీర్లో ఓ డిజాస్టర్ మూవీగా మిగిలిపోయింది. వాస్తవానికి ఈ మూవీలో రామ్ పోతినేని కాకుండా.. వేరే మాస్ ఇమేజ్ ఉన్న హీరో తో చేసి ఉంటే సుకుమార్ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లు ఒక్కడిగా నిలిచేవారని గతంలో దర్శక ధీరుడు రాజమౌళి కూడా పేర్కొన్న విషయం తెలిసిందే. వాస్తవానికి జగడం మూవీకి తొలుత అల్లు అర్జున్ ను ఫిక్స్ చేశారట కానీ . అప్పటికి అల్లు అర్జున్ మరో ప్రాజెక్ట్ను ఒప్పుకోవడంతో సుకుమార్ ప్రాజెక్టుకు నో చెప్పాల్సి వచ్చిందట. దీంతో సుకుమార్ కాంప్రమైజ్ అయి రామ్ పోతినేని హీరోగా పెట్టి జగడం సినిమా తీశారు. ఇలా సుక్కు బన్నీల కాంబినేషన్లో జగడం మూవీ మిస్సయిందని టాక్.


Click it and Unblock the Notifications











