డిక్షనరీలో రామోజీ రావుకు నచ్చని పదం ఏమిటో తెలుసా? చివరి శ్వాస వరకు అలాగే!

అతి సామాన్యుడిగా జీవితాన్ని ప్రారంభించి.. అసామాన్యుడిగా అస్తమయం అయిన వ్యక్తి రామోజీరావు. పచ్చళ్ల వ్యాపారంతో మీడియా రంగంలోకి ప్రవేశించారు.. వైజాగ్‌లో చిన్నగా దిన పత్రికను ప్రారంభించి.. ఇండియాలోనే అతి పెద్ద మీడియా వ్యవస్థగా విస్తరించారు. ఇండియా మీడియాలో ఈటీవీ అనే బ్రాండ్‌‌ను క్రియేట్ చేసి ఎంతో మందికి స్పూర్తిగా నిలిచారు. అయితే తన జీవితం చరమాంకం వరకు ఓ వర్గానికి నిద్రలేని రాత్రులు గడిచేలా చేశారు. తన ఎజెండా ప్రకారం చాలా మంది సీఎంలకు ముచ్చెటమలు పట్టించారు. రామోజీ రావు జర్నీ, ఎజెండా వివరాల్లోకి వెళితే..

కృషి పట్టుదల, క్రమ శిక్షణతో రామోజీ రావు నిరంతరం కష్టపడి సామాన్య స్థాయి నుండి పత్రిక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. మీడియా రంగంలో విలువలతో కూడిన నూతన ఒరవడికి, ఎన్నో సంస్కరణలకు ఆద్యుడిగా నిలిచారు. అనుకున్నది సాధించాలనే ఈ తరం వారికి ఆయన ఒక స్ఫూర్తి లా నిలుచారనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పొచ్చు.

Do You Know Eenadu Ramoji Rao does not Like Congress till his last breath

అయితే రామోజీరావు మొదటి నుంచి కాంగ్రెస్ వ్యతిరేక ఎజెండాను భుజానికి ఎత్తుకొన్నాడు. కాంగ్రెస్ పార్టీపై తన పత్రికతో రాజీ లేని పోరాటం చేశారు. చివరి శ్వాస వదిలే వరకు ఆయనకు నచ్చనిది ఒకే పదం కాంగ్రెస్. ఆ పార్టీ తరఫున ఎవరున్నా.. ఏ సామాజిక వర్గం నాయకుడు సీఎంగా ఉన్నా.. తీవ్రమైన విమర్శలతో కథనాలు వెలువరించే వారు.

అయితే ఓ దశలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో రామోజీరావుతో రాజీ, సయోధ్య కుదుర్చుకొనేందుకు తన అత్యంత సన్నిహితుడిని రాయబారం పంపారట. అయితే ఆయన ఆయన ప్రతిపాదనను నిర్మోహమాటంగా తిరస్కరించి.. నాకు కాంగ్రెస్ అనే పదం నాకు నచ్చదు. నా చివరి శ్వాస వరకు ఆ ఎజెండాను కొనసాగిస్తాను. నిరంతరం ఆ పార్టీకి వ్యతిరేకంగా ఆ పోరాటాన్ని కొనసాగిస్తాను చెప్పారట.

అలా వైఎస్ఆర్‌కు సందేశం పంపడంతో రామోజీ సంస్థలపై ఆనాటి ప్రభుత్వం కేసులతో అల్లాడించింది. వైఎస్ఆర్ తన కుటుంబ పత్రిక మార్గదర్శి చిట్‌ఫండ్‌పై కథనాలను వెలువరించింది. అలాగే ఆయనపై కేసులు పెట్టి ఆ సంస్థను దెబ్బ తీసేందుకు ప్రయత్నించింది. అయినా రామోజీరావు ఏ క్షణంలో కూడా రాజీకీ ప్రయత్నించలేదని చెప్పుకొంటారు.

అదే సంప్రదాయాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఆయన పోరాటం కొనసాగించారు. ఆయన తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్‌లో ఉన్న సమయంలో కూడా సీఐడీ అధికారులతో అరెస్ట్ చేయించాలనే విశ్వ ప్రయత్నాలు చేశారు. అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలను తిపి కొట్టేలా ఈనాడును ఆయుధంగా ఉపయోగించుకొన్నారు. చివరి శ్వాస విడిచే వరకు కాంగ్రెస్ అంటే గిట్టని విధంగా అదే ఎజెండాను కొనసాగించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X