Thandel : 900 మందితో సాంగ్ .. ఒక్క పాట కోసం అన్ని కోట్లు ఖర్చు చేశారా?
అక్కినేని యువసామ్రాట్ నాగచైతన్య - లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'తండేల్'. ఈ చిత్రం ఈరోజు థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది. అక్కినేని అభిమానులు, ఇటు సాయిపల్లవి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసిన సినిమా థియేటర్లలో విడుదలై సందడి చేస్తోంది. ప్రస్తుతం సినిమాకు మంచి రెస్పాన్సే దక్కుతోంది. యాదార్థ ఘటన దానికి దేశభక్తి, ప్యూర్ ఎమోషనల్ లవ్ ను జోడించడంతో ప్రేక్షకులను మెప్పిస్తోంది.
దానికి తోడు నాగచైతన్య, సాయిపల్లవి పెర్ఫామెన్స్ కూడా ఓ రేంజ్ లో ఉందని, ఆడియెన్స్ ను మెప్పించేలా ఈ క్రేజీ జోడీ నట ప్రదర్శన చేసిందని ఆడియెన్స్ చెబుతున్నారు. ఇక ఫ్యాన్స్ కు ఈ చిత్రం మంచి ట్రీట్ అనే చెప్పాలి. మరోవైపు మిశ్రమ స్పందన కూడా కనిపిస్తోంది. ఏదేమైనా ఈ చిత్రంతో నాగచైతన్యకు మంచి రెస్పాన్స్ దక్కుతోందనే చెప్పాలి. ఇదిలా ఈ సినిమాలోని సాంగ్స్ మాత్రం సెన్సేషనల్ గా మారుతున్నాయి.

ఇప్పటికే బుజ్జి తల్లి సాంగ్ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో తెలిసిందే. యువతను, పెద్దలను కూడా ఈ సాంగ్ ఎంతగానో ఆకట్టుకుంది. అయితే థియేట్రికల్ రిలీజ్ వరకు ఈ చిత్రం నుంచి నాలుగు పాటలను వదిలారు. అన్నీ సూపర్ రెస్పాన్స్ నే దక్కించుకున్నాయి. ఇప్పటికీ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ మూవీలో ఓ కాస్ట్లీ సాంగ్ కూడా ఉండటం విశేషం. ఒక్క సాంగ్ కోసమే నిర్మాతలు కోట్లు ఖర్చు పెట్టారు.
ఆ సాంగే.. 'నమో నమః శివాయా'... రెండో సాంగ్ గా ఈపాటలను యూనిట్ విడుదల చేసింది. కాగా.. జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ఈ చిత్రానికి లిరిక్స్ అందించారు. అనురాగ్ కులకర్ణి, హరిప్రియా గాత్రం అందించారు. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ అద్భుతమైన డివోషనల్ ట్యూన్ ను అందించారు. ఈ ఒక్క పాటను షూట్ చేసేందుకే నిర్మాతలు రూ.4 కోట్లు ఖర్చు చేశారంట. 900 మంది ట్రైన్డ్ డ్యానర్లతో సాంగ్ ను చిత్రీకరణ జరగిందంట.

ఈ సాంగ్ లో సాయిపల్లవి పెర్ఫామెన్స్ ఓ అద్భతమనే చెప్పాలి. శివతాండవాన్ని చూపించేలా సాయిపల్లవి ఆడిందనడానికి ఇప్పటికే రిలీజ్ అయిన లిరికల్ వీడియో తెలియజేస్తోంది. అలాగే సినిమా చూసిన ఆడియెన్స్ కూడా చెబుతున్నారు. మరోవైపు ఫ్యాన్స్ కు మాత్రం పూనకాలే అని చెప్పాలి. బుజ్జి తల్లితో పాటు, శివుడి పాట కూడా య్యూటూబ్ లో ట్రెండ్ అవుతోంది.


Click it and Unblock the Notifications











