Ghilli Movie: గిల్లీ మూవీ సెన్సేషన్.. ఇప్పటి వరకు ఎంత మంది చూశారంటే?

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమై టాలెంట్ కల్గిన ఈయన హీరోగా వచ్చిన గిల్లీ సినిమాను ఇప్పటికీ ఎవరు మర్చిపోలేరు. ఒకప్పుడు విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం రీరిలీజ్ అయి ఇప్పుడు కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. వారం రోజుల క్రితం విడుదల అయిన ఈ సినిమాను ఇప్పటి వరకు ఎంత మంది చూశారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన ఒక్కడు సినిమా ఆధారంగా తెరకెక్కిన గిల్లీ సినిమాలో విజయ్ దళపతి హీరోగా చేశాడు. శ్రీ సూర్య మూవీస్ నిర్మాణ సంస్థలో ఏ. ఎమ్. రత్నం నిర్మించారు. విజయ్ తో పాటు ప్రకాష్ రాజ్, త్రిష ప్రధాన పాత్రలలో ఆశిష్ విద్యార్థి, ధాము, మాయిల్సామి, జానకి సబేష్ సహాయక పాత్రల్లో నటించి మెప్పించారు. 2004 ఏప్రిల్ 17వ తేదీన విడుదల అయిన ఈ సినిమా బక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబట్టుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా రూ.50 కోట్లకు పైగా రాబట్టుకుంది.

Do You Know How Many embers Watch Ghilli Movie Check Detaiils

అయితే ఈ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని ఏప్రిల్ 15వ తేదీన రీరిలీజ్ చేశారు. ఇక అప్పటి నుంచి ఈ సినిమాను చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. పెద్ద ఎత్తున ఈ చిత్రాన్ని చూస్తూ థియేటర్ల వద్ద రచ్చ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ చిత్రాన్ని చాలా మందే చూశారు. బుక్ మై షో ఆధారంగా.. ఈ సినిమాను ఎంత మంది చూశారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏప్రిల్ 15వ తేదీన 7.71కే మంది అంటే 7 వేల 710 మది చూడగా.. 16వ తేదీ రోజు 9.21కే అంటే 9 వేల 210 మంది, 17వ తేదీ రోజు 17.18కే అంటే 17 వేల 180 మంది ఈ చిత్రాన్ని చూశారు.

ఇక 18వ తేదీ రోజు 21.42కే అంటే 21 వేల 420 మంది, 19వ తేదీ రోజు 33.17కే మంది అంటే 33 వేల 170 మంది, 20వ తేదీ రోజు 61.62కే మంది అంటే 61 వేల 620 మంది ఈ చిత్రాన్ని చూశారు. 21వ తేదీ రోజు 54.16కే మంది అంటే 54 వేల 160 మంది, 22వ తేదీ రోజు 27.79కే మంది అంటే 27 వేల 790 మంది ఈ చిత్రాన్ని చూసేందుకు బుక్ మై షో ద్వారా టికెట్లు బుక్ చేసుకున్నారు. 23వ తేదీ రోజు 26.08కే అంటే 26 వేల 80 మంది, 24వ తేదీ రోజు 27.32కే అంటే 27 వేల 320 మంది, 25వ తేదీ రోజు 29.53కే అంటే 29 వేల 530 మంది ఈ చిత్రాన్ని చూసేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు.

Do You Know How Many embers Watch Ghilli Movie Check Detaiils

ఇలా సినిమా రీరిలీజ్ అయిన 10 రోజుల్లోనే మొత్తం 315.19కే అంటే 3 లక్షల 15 వేల 190 మంది ఒక్క బుక్ మై షో ద్వారానే ఈ చిత్రాన్ని చూశారు. ఇక థియేటర్లలో చూసిన వారి సంఖ్యకు లెక్కే లేదు. రీరిలీజ్ అయిన తర్వాత కూడా ఈ రేంజ్ లో సెన్సేన్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమాను ఇప్పటి వరకు మీరు కూడా చూసి ఉండకపోతే వెంటనే వెళ్లి చూసేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X