కూతురిపై అర్జున్ సర్జాకు కొండంత ప్రేమ... అల్లుడికి కట్నంగా ఎంతించ్చారు? ఏమిచ్చారంటే?

యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ వివాహం కమెడియన్ తంబి రామయ్య కొడుకు ఉమాపతితో గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. అయితే కూతురు మీద ఉన్న మితిమీరిన ప్రేమతో అర్జున్ కట్నంగా భారీగా సమర్పించుకున్నాడు అంటూ తాజాగా ఓ వార్త బయటకొచ్చింది. మరి ఇంతకీ తన అల్లుడికి అర్జున్ కట్నంగా ఏమిచ్చాడు? ఎంత ఇచ్చాడు? అనే విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.

ఒకప్పుడు స్టార్ హీరోగా సౌత్ లో ఓ వెలుగు వెలిగిన అర్జున్ ప్రస్తుతం విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నాడు. చివరిసారిగా లియో సినిమాలో నటించిన అర్జున్ ఇప్పుడు మాత్రం తన కూతురు ఐశ్వర్య అర్జున్ పెళ్లి గురించిన విషయాలతో వార్తల్లో నిలిచారు. నటుడు ఉమాపతితో ఐశ్వర్య అర్జున్ వివాహం జూన్ 10న ఘనంగా జరిగింది. చెన్నైలో ఉన్న అంజనసుత శ్రీ యోగాంజనేయ స్వామి మందిరంలో పెళ్లి వేడుక జరిగింది. విశేషం ఏమిటంటే అర్జున్ స్వయంగా ఈ గుడిని నిర్మించారు.

Do you know how much Arjun Sarja gave Dowry and Gift to Aishwarya Umapathy Couple

కాగా హల్దీ వేడుకతో జూన్ 7న పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. జూన్ 8న సంగీత్ జరగగా, జూన్ 10న ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య ఐశ్వర్య, ఉమాపతిల వివాహం జరిగింది. ఇక ఈ పెళ్లి వేడుకకు ఇరివురి కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే పెళ్లి కంటే గ్రాండ్ గా రిసెప్షన్ జరిగింది. జూన్ 14న ఐశ్వర్య, ఉమాపతిల వివాహ రిసెప్షన్ జరగ్గా, రజనీకాంత్‌తో పాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ నేపథ్యంలోనే అర్జున్ తన అల్లుడికి ఇచ్చిన కట్నం గురించి చర్చ నడుస్తోంది. అర్జున్ కి మొత్తం ఇద్దరు కూతుర్లు ఉన్న విషయం తెలిసిందే. వారిలో పెద్ద కూతురు ఐశ్వర్య. ఈ బ్యూటీ సినిమాల్లో కూడా నటించింది. అయితే అర్జున్ హోస్ట్ గా వ్యవహరించిన ఓ రియాలిటీ షోలో పాల్గొన్న ఐశ్వర్య, అందులో మరో కంటెస్టెంట్ గా ఉన్న ఉమాపతి ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.

Do you know how much Arjun Sarja gave Dowry and Gift to Aishwarya Umapathy Couple

అయితే అర్జున్ తన కూతురి పెళ్లికి కట్నం గా రూ.150 కోట్లు ఇచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి. విలువైన విలాసవంతమైన బంగ్లాను కూడా బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం. అర్జున్ కు చెన్నై లో చాలా స్థలాలు ఉన్నాయని తెలుస్తోంది. వాస్తవానికి అర్జున్ తన కూతురికి ఎంత కట్నం ఇచ్చారు అనే విషయం ఇంకా ఎవ్వరికీ సరిగ్గా తెలియదు. అయితే నిజానికి అర్జున్ కి వారసులు లేరు.

ఇద్దరు కూతుర్లు మాత్రమే ఉన్నారు కాబట్టి, ఆయన తన ఆస్తిలో సగభాగం ఐశ్వర్య కు కట్నంగా ఇచ్చాడని తెలుస్తోంది. మిగిలిన భాగాన్ని రెండవ కూతురుకు కట్నంగా ఇస్తాడని అంటున్నారు. ఏదేమైనా అర్జున్ తన పెద్ద కూతురికి ఇచ్చిన కట్నం గురించి సరైన సమాచారం ఇంకా బయటకు రాలేదు. ప్రస్తుతం ఐశ్వర్య, ఉమాపతిల పెళ్ళి, రిసెప్షన్ లకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X