Salaar: దర్శక ధీరుడు రాజమౌళి కొన్న సలార్ టికెట్ ధర ఎంతో తెలుసా? మీరేమైనా చెప్పగలరా?

గత కొంత కాలంగా సినీ ప్రియుల నోట ఎక్కువగా వినిపిస్తున్న పేరు సలార్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ చిత్రం గురించి పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. టికెట్లు బుక్ చేశావా, అర్ధరాత్రి వీలవుద్దా.. ఫస్ట్ డే ఫస్ట్ షోకు కచ్చితంగా వెళ్దాం, ఫస్ట్ షఓ కుదరకపోయినా కనీసం ఫస్ట్ డే అయినా పోదామంటూ అంతా మాట్లాడుకుంటున్నారు. రిలీజ్ కు ముందే జనాలకు ఫీవర్ తెప్పిస్తున్న ఈ సినిమా.. రిలీజ్ అయ్యాక ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి. ముఖ్యంగా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22వ తేదీన విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన టికెట్లు కూడా అందుబాటులోకి వచ్చేశాయి.

అడ్వాన్స్ బుకింగ్స్ పేరిట ప్రభాస్ అభిమానులు అంతా టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ టికెట్ ను ఈరోజు అమ్మేశారు. అయితే దాన్ని దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళికి ఇచ్చారు. అయితే ఆయనకు ఇచ్చిన ఈ ఫస్ట్ టికెట్ ఫ్రీగా మాత్రం కాదండోయ్. డబ్బులు ఇచ్చే డైరెక్టర్ రాజమౌళి చిత్రం బృందం నుంచి సలార్ సినిమా మొదటి టికెట్ ను తీసుకున్నారట. అయితే ఈ సినిమా టికెట్ ధర ఎంతో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Do You Know How Much Cost Of Salaar Movie Fisrt Ticket Cost Check Details

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శృతి హాసన్ లు హీరోహీరోయిన్లుగా రాబోతున్న ఈ చిత్రంలో జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా కనిపించబోతున్నారు. అలాగే హొంబలే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్.. 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదల అయిన ఈ సినిమా పాటలు, ట్రైలర్, టీజర్లు అదిరిపోయాయి. సినిమా కూడా అదే రేంజ్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఈక్రమంలోనే చాలా మంది ఈ చిత్రం చూడాలని ప్లాన్ చేసుకుంటున్నారు. టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో నిఖిల్ సిద్దార్థ కూడా ఈ చిత్రాన్ని చూడబోతున్నట్లు ప్రకటించాడు. అంతేకాదు శ్రీరాములు థియేటర్ లో అర్ధరాత్రి ఒంటి గంటషోకు వెళ్తానని... తనతో పాటు ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్స్ వస్తే వారికి 100 టికెట్లను ఫ్రీగా ఇస్తానని కూడా ప్రకటించారు. అలాగే తాజాగా నైజాం డిస్ట్రిబ్యూటర్స్ మైత్రీ సంస్థను మొదటి టికెట్ ను పొందిన డైరెక్టర్ రాజమౌళి.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న సంధ్య థియేటర్‌లో ఉదయం 7 గంటల షోకు రాజమౌళి చూడబోతున్నారు.

అయితే ప్రభాస్ కు చెందిన ఈ సలార్ సినిమా మొదటి టికెట్ ను రాజమౌళి అక్షరాలా పది వేల నూట పదహారు రూపాయలకు కొనుగోలు చేశారు. 10, 116 రూపాయలను చెల్లించి పొందిన ఈ సినిమా టికెట్ ను ఉపయోగించే డిసెంబర్ 22వ తేదీ ఉదంయ 7 గంటల చూడబోతున్నట్లు ప్రకటించారు. మరి వీరే కాకుండా ఇంకా ఎంత మంది టాప్ హీరోలు ఈ చిత్రాన్ని చూస్తారో చూడాలి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X