Ramoji Rao: రామోజీ రావు అద్బుత కలల సౌధం.. రామోజీ ఫిలిం సిటీ విలువ ఎన్ని కోట్లో తెలుసా?

అతి సామాన్యుడిగా వ్యాపార రంగంలోకి ప్రవేశించిన రామోజీ రావు అంచెలంచెలుగా ఎదిగి.. ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా అందులో సెలబ్రిటీగా మారారు. ఆయన మొదలుపెట్టిన వ్యాపారాలు అందరికీ స్పూర్తిగా నిలిచాయి. ఇక మీడియా నుంచి సినీ రంగంలోకి ప్రవేశించిన ఆయన సంచలన విజయాలను అందుకొన్నారు. ఆ క్రమంలోనే ఆయన కలల సౌధం రామోజీ ఫిలిం సిటీ ప్రపంచవ్యాప్తంగా అందర్నీ ముక్కున వేలేసుకొనే విధంగా చేసింది. అలాంటి రామోజీ ఫిలిం సిటీకి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ నగర శివారులోని అబ్దుల్లామెంట్‌లోని ప్రాంతంలో రామోజీ ఫిలిం సిటీని నిర్మించారు. సుమారుగా 3000 ఎకరాల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడియో కాంప్లెక్స్‌గా చరిత్ర సృష్టించింది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించేలా రామోజీ రావు ఈ స్టూడియోను తీర్చి దిద్దారు.

Do You Know How Much net worth of Ramoji Rao s Ramoji Film City

1996 సంవత్సరంలో ప్రారంభమైన రామోజీ ఫిలిం సిటీని సిటీ ఆఫ్ సిటీగా గిన్నిస్ బుక్ అభివర్ణించింది. ఏటా 20 లక్షల మంది ఈ అద్బుతమైన ప్రాంతాన్ని సందర్శిస్తుంటారని అంచనా. ఈ స్టూడియోలోనే బాహుబలి, కేజీఎఫ్, సలార్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు రూపుదిద్దుకొన్నాయి. ప్రతీ రోజు పదుల సంఖ్యలో షూటింగులు జరుగుతుంటాయి.

రామోజీ ఫిలిం సిటీలో ఈనాడు, ఈటీవీ లాంటి మీడియా సంస్థలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తన్నాయి.అంతేకాకుండా జాతీయ మీడియాకు సంబంధించిన సంస్థ కూడా తమ కార్యకలాపాలకు ఈ ప్రాంతానే వేదికగా చేసుకొన్నది. మీడియా, సినిమా రంగాలకు అడ్డాగా మారింది.

Do You Know How Much net worth of Ramoji Rao s Ramoji Film City

ఇక రామోజీ ఫిలిం సిటీ ప్రతి రోజు సందర్శకుల పర్యటనల ద్వారా లక్షలాది రూపాయలను ఆర్జిస్తున్నది. ఇక ప్రతి నెల సినిమా షూటింగుల ద్వారా కోట్లాది రూపాయల ఆదాయాన్ని సమకూర్చుకొంటున్నది. ఇలాంటి ఫిలిం సిటీ బాలీవుడ్, ఇతర భాషల చిత్రాలకు సురక్షిత ప్రాంతంగా మారిందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

అయితే తాజా అంచనాల ప్రకారం.. రామోజీ ఫిలిం సిటి నికర విలువ 1 లక్షల కోట్లకుపైగానే ఉంటుందనే ఆర్థిక నిపుణుల అంచనా. రామోజీ ఆలోచనలకు, విజన్‌ ప్రకారం రూపుదిద్దుకొన్న ఈ కట్టడం ఇండియన్ సినిమా రంగం అభివృద్దికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. తెలుగు రాష్ట్రాలకు ప్రతిష్టగా మారిందని చెప్పవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X