Klin Kaara: క్లీంకార కేర్ టేకర్​కు​ నెల జీతం అన్ని లక్షలా.. ఆమెనే ఎందుకు సెలెక్ట్ చేశారంటే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన దంపతుల ముద్దుల పాప పేరు క్లీంకార. ఈ బుడ్డది పుట్టినప్పటి నుంచి మెగా ఫ్యామిలీతో పాటు మెగా అభిమానులు కూడా సంతోషంతో తెగ సంబరపడిపోతున్నారు. అయితే ఈ చిన్నది పుట్టినప్పటి నుంచి మాత్రం ఆమె ఫేస్​ను మాత్రం రివీల్ చేయలేదు. ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే ఇప్పుడీ పాపకు ఓ కేర్​ టేకర్​ను నియమించారు చరణ్ దంపతులు. ఇప్పుడామెకు ఇస్తున్న నెల జీతం సోషల్​ మీడియాలో షాకింగ్​గా మారింది? అసలు ఆమెనే ఎందుకు ఎంపిక చేశారు? నెలకు ఎన్ని లక్షలు ఇస్తున్నారు? వంటి విషయాలను స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం..

మెగా పవర్ స్టార్ రామ్​ చరణ్ - ఉపాసన కొణిదెల కపుల్​ ప్రస్తుతం తల్లిదండ్రులుగా తమ కుమార్తె క్లీంకారతో కలిసి లైఫ్​ను హ్యాపీగా గడుపుతున్నారు. తమ ముద్దుల కూతురి కోసం సమయం కేటాయించి తనతోనే ఉంటున్నారు. ఈ చిన్నారి కోసం భారీ ఖర్చుతో ప్రత్యేకంగా గదిని కూడా తీర్చిదిద్దారు. ఇకపోతే క్లీంకారను చూడాలని మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ చరణ్, ఉపాసన మాత్రం కూతురుతో బయటకు వెళ్లినా కూడా ఆ చిన్నారి ముఖం కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. మెగాఫ్యామిలీ ఫంక్షన్స్ ఫొటోస్​ను పోస్ట్ చేసినా కూడా అందులో చిన్నారి ఫేస్​కు లవ్​ ఎమోజీలు పెట్టి షేర్​​ చేస్తున్నారు.

Do You Know How Much Ram Charan Upasana Daughter KlinKaara Care Taker Salary Per Month Full Details Here

అయితే ఇప్పుడా మెగా ఫ్యామిలీ ముద్దుల పాప క్లీంకారకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం ఫిల్మ్​ నగర్​లో తెగ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఇప్పుడు మళ్లీ చరణ్​ - ఉపాసన కాస్త బిజీ కానున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ వరుసగా తన షూటింగ్​లలో పాల్గొనేందుకు రెడీ అవుతున్నారట. అటు ఉపాసన కూడా అపోలో హాస్పిటల్ బాధ్యతలతో కాస్త బిజీగా ఉంటోంది. దీంతో క్లీంకార కోసం ఓ ప్రముఖ కేర్ టేకర్​ను ఏర్పాటు చేశారని తెలిసింది.

Do You Know How Much Ram Charan Upasana Daughter KlinKaara Care Taker Salary Per Month Full Details Here

సావిత్రి అనే కేర్ టేకర్​ను నియమించినట్లు తెలిసింది. ఈమె బాలీవుడ్ స్టార్ హీరోయిన్​ కరీనా కపూర్ కొడుకు తైమూర్​కు కూడా కేర్ టేకర్​గా వ్యవహరించింది. దీంతో ఆమె సోషల్​ మీడియాతో అందరికీ తెలిసింది. ఎందుకంటే అదే సమయంలో కరీనా ఆమెపై ప్రశంసలను కురిపించింది. అయితే సావిత్రి జీతం కూడా ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. నెలకు ఆమెకు లక్షన్నార ఇస్తున్నారట. రీసెంట్​గా కూడా చరణ్, ఉపాసన ముంబయికి వెళ్ళినప్పుడు సావిత్రి కూడా వారితో అక్కడ కనిపించారు.

ఇకపోతే రామ్ చరణ్​ ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే పొలిటికల్ థ్రిల్లర్​లో నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామా చేయనున్నారు. అయితే ప్రస్తుతం మెగా ఫ్యామిలీ అంతా మెగాస్టార్​ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన ఆనందంలో ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X