Globe Trotter: వారణాసి ఈవెంట్ కోసం ఖర్చు ఎన్ని కోట్లంటే? ఆ విషయంలో రాజీ పడని రాజమౌళి!

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్న చిత్రం వారణాసి. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో 29వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం, విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు.

ఈ సినిమాకు కథ, మాటల సహకారాన్ని దేవకట్టా అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌గా తమ్మిరాజు, ఫైట్స్ కింగ్ సాల్మన్, సినిమాటోగ్రఫిని ఎస్ గోపాల్ రెడ్డి, పీఎస్ వినోద్ అందిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ రివీల్ ఈవెంట్ ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. అయితే ఈవెంట్ కోసం చేసిన ఏర్పాట్లు తెలుగు సినిమా పరిశ్రమలో గుర్తుంచుకొనే విధంగా చేశారు.

SS Rajamouli Spent budget for Mahesh Babu s Varanasi

లోకల్ మీడియా నుంచి అంతర్జాతీయ మీడియా వరకు ఈ వేడుకలో భాగమయ్యారు. ఈ వేడుకను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించడంపై ప్రశంసల వర్షం కురుస్తున్నది. ఈ వేడుక నిర్వహించడం కోసం ఎంత ఖర్చు చేశారనే విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఈవెంట్ కోసం ఎంత ఖర్చు చేశారనే విషయంలోకి వెళితే..

వారణాసి టైటిల్ రివీల్ ఈవెంట్ కోసం రాజమౌళి టీమ్ భారీ కసరత్తు చేశారు. మూడు, నాలుగు రోజుల ముందు నుంచే ట్రయల్ రన్, రిహార్సల్స్ పూర్తిస్థాయిలో చేశారు. యాంకర్లు, ఆర్టిస్టులకు తగిన సలహాలు, సూచనలు ఇచ్చారు. వారు నిర్వహించాల్సిన విధానంపై చిన్నపాటి కోచింగ్ కూడా జక్కన్న ఇచ్చారనే విషయం వీడియోల ద్వారా స్పష్టమైంది. అయితే గ్లోబల్ సినిమాను విశ్వవాప్తంగా సినీ ప్రేక్షకులకు తమ కంటెంట్‌ను అందించాలనే ప్రయత్నంలో రాజీపడుకుండా రాజమౌళి భారీ అడుగు వేశాడనేది ఈవెంట్ కోసం చేసిన ఏర్పాట్లు స్పష్టం చేశాయి.

ఈవెంట్‌ను ప్రసారం చేయడానికి, తమ కంటెంట్‌ను చూపించడానికి భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. దాదాపు 130 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. ఈ స్క్రీన్ పనిచేయడానికి భారీగా విద్యుత్ అవసరం కావడంతో సుమారుగా 40కిపైగా జనరేటర్లను సిద్దం చేశారు. ఇందుకోసం సుమారుగా 8 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్టు తెలుస్తున్నది.

ఈవెంట్‌లో స్టార్ హీరోయిన్ శృతిహాసన్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. సంచారీ పాటపై ఆమె పెర్ఫార్మెన్స్ చేసినందుకు భారీగా రెమ్యునరేషన్ చెల్లించారు. ఈ పాట పాడినందుకు, పెర్ఫార్మెన్స్ చేసినందుకు ఒక కోటి రూపాయలు పారితోషికం చెల్లించినట్టు సమాచారం. ఇక ఈవెంట్ కోసం మొత్తంగా 30 కోట్ల రూపాయలను నిర్మాత కేఎల్ నారాయణ ఖర్చు చేశారు. ఇందుకోసం భారీగా స్పాన్సర్లను ఆహ్వానించినట్టు తెలిసింది. అయితే ఈ ఖర్చు మీడియా రేంజ్ సినిమా బడ్జెట్‌కు సమానం. నాలుగైదు చిన్న సినిమాలు హాయిగా తీయ్యెచ్చు అంటూ ఇండస్ట్రీ వర్గాలు కామెంట్ చేస్తున్నారు.

More from Filmibeat

Read more about: ss rajamouli mahesh babu Varanasi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X