హీరోయిన్ల కోసం ప్రత్యేక పూజలు... వేణు స్వామి ఎంత వసూలు చేస్తారో తెలుసా?
ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వేణు స్వామి జాతకాన్ని నమ్మే ఎంతో మంది సెలబ్రిటీలు ప్రత్యేకంగా ఆయనతో పూజలు కూడా చేయించుకున్నారు. మరి హీరోయిన్లతో ప్రత్యేక పూజలు చేయించినప్పుడు వేణు స్వామి ఎంత వసూలు చేస్తారు? అనే ఇంట్రెస్టింగ్ విషయంపై మనం కూడా ఓ లుక్కేద్దాం పదండి.
సోషల్ మీడియాలో తరచుగా ఏదో ఒక రకంగా వార్తల్లో నిలిచే వేణు స్వామి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలు చెబుతుంటారు. ఆయన వాళ్లపై చేసే సెన్సేషనల్ కామెంట్స్ కారణంగా పలుసార్లు విమర్శలకు కూడా గురయ్యారు. అయినప్పటికీ పలువురు హీరోయిన్లు ఆయనతో ప్రత్యేక పూజలు చేయించుకుంటున్నారు.

ఇక వేణు స్వామి వామాచారంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అందుకే ఆయన పూజలో తీర్ధంగా ఆల్కహాల్ ని వాడతారు. పలుమార్లు ఇదెక్కడి పూజ, పూజలో ఎవరన్నా మందును పెడతారా అనే కామెంట్స్ కు ఆయన తనదైన స్టైల్ లో రిప్లై ఇచ్చారు. తను ఏఏ దేవతలకు పూజలు చేస్తారో కూడా చెప్పుకొచ్చారు.
అయితే కొంతమంది వేణు స్వామి జాతకం గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ చాలామంది హీరోయిన్లు మాత్రం తమ కెరియర్ బాగుండాలని ఆయనతో ప్రత్యేకంగా పూజలు చేయించుకుంటున్నారు. అనన్య నాగళ్ళ, అషు రెడ్డి వంటి ప్రముఖులతో పాటు రష్మిక మందన్న, నిధి అగర్వాల్ లాంటి స్టార్ హీరోయిన్లు కూడా వేణు స్వామి చేత ప్రత్యేక పూజలు చేయించిన వాళ్లే.
అయితే ఆయన చేసిన పూజల వల్ల కొంతమంది సక్సెస్ ఫుల్ గా కెరీర్ లో దూసుకెళ్తున్నారు. మరి ఇలా పూజలు చేసినందుకు వేణు స్వామి ఎంత ఫీజు తీసుకుంటారు అనే డౌట్ చాలా మందికి వచ్చే ఉంటుంది. అయితే ఓ ఇంటర్వ్యూలో వేణు స్వామి మాట్లాడుతూ తను హీరోయిన్ల కోసం పూజలు చేసినప్పుడు ప్రత్యేకంగా డబ్బులు ఏమీ తీసుకోనని వెల్లడించారు.

తనకు పెద్ద పెద్ద క్లైంట్స్ ఉన్నారని, టాప్ బిజినెస్ మెన్స్ కూడా తన దగ్గర జ్యోతిష్యం చెప్పించుకుంటారని ఈ సందర్భంగా వేణు స్వామి చెప్పుకొచ్చారు. డబ్బుల కోసమే జ్యోతిష్యం చెప్పే స్థాయికి తను ఇంకా దిగజారలేదని, తనకు రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉందని, ఓ పబ్ ని అమ్మేశానని వేణు స్వామి వివరించారు.
అయితే హీరోయిన్లలో రష్మిక మాత్రం తనకు డబ్బులు ఇచ్చారని, ఇతర హీరోయిన్ల దగ్గర తను ఎప్పుడూ డబ్బులు తీసుకోలేదని వేణు స్వామి చెప్పుకొచ్చారు. అయితే టాలీవుడ్ లో కూడా బ్లాక్ మ్యాజిక్ ఉందని, హీరోలు, హీరోయిన్లు, యాంకర్లు తమకు పోటీగా ఉన్న వాళ్ళు ఎదగకుండా చేసిన సందర్భాలు ఉన్నాయంటూ వేణు స్వామి సెన్సేషన్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.
ఇక హీరోయిన్లు బలవంతంగా తనకు డబ్బులు ఇస్తామని చెప్తే గ్రూప్ లో పూజ చేసిన పండితులకు 50,000 ఇవ్వమని మాత్రం చెప్తానని ఈ సందర్భంగా వేణు స్వామి తెలిపారు. బిజినెస్ మెన్స్ నుంచి తనకు 10 లక్షలు ఇస్తారని, అమ్మాయిలలో తాను అమ్మవారిని చూస్తానని వేణు స్వామి చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











