Mahesh Babu శ్రీమంతుడు కథ కాపీ వివాదం.. హృతిక్ రోషన్‌కు నోటీసులు?..అసలేం జరిగిందంటే?

శ్రీమంతుడు సినిమా కథ నాదేనంటూ శరత్ చంద్ర అలియాస్ ఆర్డీ విల్సన్ గతేడాది ఫిబ్రవరి 6వ తేదీన దాఖలు చేసిన కేసు విషయం ప్రస్తుతం సంచలనంగా మారింది. స్వాతి దినపత్రికలో ప్రచురితమైన సచ్చెంత ప్రేమ కథను చౌర్యానికి పాల్పడి శ్రీమంతుడు సినిమాను తెరకెక్కించారని పిటిషన్ దాఖలు చేయడంతో హీరో మహేష్ బాబుకు సంబంధించిన ఎంబీ క్రియేషన్స్, దర్శకుడు కొరటాల శివకు సమన్లు జారీ చేయాలని శరత్ చంద్ర కోరారు. అయితే శరత్ చంద్ర ఫిర్యాదు చేసిన వ్యక్తులకు వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది.

దాంతో ఈ నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ వ్యవహారంలో దర్శకుడు కొరటాలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి, హైకోర్టు ఆదేశించాయి. ఆ తర్వాత ఈ కేసుపై సుప్రింకోర్టులో కొరటాల తరఫు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో కేసుకు సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే..

Do You Know Hrithik Roshan get notices in Maheshbabu Srimanthudu Copyright Infringement Case

శ్రీమంతుడు కథ చౌర్య కేసు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో కొనసాగుతుండగానే.. బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్‌తో రీమేక్ చేస్తున్నారని వార్త రావడంతో శరత్ చంద్ర ఆ ప్రయత్నాలను ఆపేందుకు మరోసారి కోర్టును ఆశ్రయించారు. కాపీరైట్స్ చట్టం ఉల్లంఘనను పట్టించుకోకుండా నిర్మాతలు ఎర్నేని నవీన్‌, కొరటాల ప్రయత్నిస్తున్నారని కోర్టుకు ఫిర్యాదు చేశారు.

బాలీవుడ్ రీమేక్‌పై శరత్ చంద్ర దాఖలు చేశారు. ఈ కేసు తేలేంత వరకు హిందీలో రీమేక్ చేయకుండా ఆపాలని కోర్టును అభ్యర్థించారు.దాంతో పిటిషన్‌ను విచారించిన కోర్టు.. ఈ విషయంలో నిర్మాత, దర్శకులతోపాటు హృతిక్ రోషన్‌కు కూడా నోటీసులు జారీ చేశారు.

అనంతరం శ్రీమంతుడు కథ చౌర్యం కేసులో నాంపల్లి కోర్టు, హైకోర్టు రచయిత శరత్ చంద్రకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. కొరటాలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దాంతో దిగువ కోర్టులు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కొరటాల తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Do You Know Hrithik Roshan get notices in Maheshbabu Srimanthudu Copyright Infringement Case

అయితే ఈ పిటిషన్‌ను పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం.. దిగువ న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుకే కట్టుబడి ఉండాలని సూచించింది. ఈ కేసులో మీ పిటిషన్‌ను వెనక్కి తీసుకొంటారా? మేము డిస్మస్ చేయాలా? అని కోర్టు ధర్మాసనం అడిగింది. దాంతో కొరటాల తరఫు న్యాయవాది తన పిటిషన్‌ను వెనక్కి తీసుకొన్నారు. జనవరి 29వ తేదీన వెల్లడించిన సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ కేసు మరోసారి తెరపైకి వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X