KGF2 మూవీలో ఇనాయత్ ఖలీల్ ఆ బిగ్‌బాస్ కంటెస్టెంట్ తండ్రే.. ప్రశాంత్ నీల్‌తో అలాంటి బంధుత్వం!
తెలుగు సినిమా సత్తాను బాహుబలి ప్రపంచవ్యాప్తంగా చాటి చెబితే కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించింది 'KGF Chapter 1'. ఈ సినిమా వస్తూ వస్తూనే ఎన్నో రికార్డులను బ్రేక్ చేయడంతో పాటు జాతీయ అవార్డులు సైతం దక్కించుకుంది. రాకింగ్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో ఐదు భాషల్లో విడుదలైంది. అన్ని చోట్లా భారీ స్పందనను దక్కించుకుని సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. అందుకే ఆ సినిమాకు సీక్వెల్ గా 'KGF Chapter 2' తెరకెక్కించారు. ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 14న విడుదలైంది. ఈ సినిమాలో ఇనాయత్ ఖలీల్ గా నటించిన బాలకృష్ణ గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు
Recommended Video


భారీ బడ్జెట్‌తో
కేజీఎఫ్ చాప్టర్ 1 సూపర్ హిట్ కావడంతో దానికి కొనసాగింపుగా రాకింగ్ స్టార్ యశ్, ప్రశాంత్ నీల్ కలిసి చేసిన చిత్రమే 'KGF Chapter 2'. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రాన్ని హొంబళే ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఇందులో విలన్ అధీరగా సంజయ్ దత్ నటించారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది.

రాఖీని ఎదిరించేందుకు
ఇతర కీలక పాత్రలో రవీనా టాండన్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ నటించారు. రవి బస్రూర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాకు భువన్ గౌడ కెమెరా బాధ్యతలు చూశారు. కేజీఎఫ్‌ను రాఖీ భాయ్ సొంతం చేసుకోవడంతో చాప్టర్ 1 పూర్తి కాగా రెండో భాగం రాఖీని ఎదిరించేందుకు అధీరా ఎంట్రీ ఇవ్వడంతో మొదలవుతుంది. ఆ తర్వాత వాళ్లిద్దరి మధ్య పోరాటం జరిగే తీరుతోనే సినిమా రూపొందింది.

ఇనాయత్ ఖలీల్ పాత్ర
ఇక రమికా సేన్, ఇనాయత్ ఖలీల్ పాత్రలు కూడా ఈ సినిమాలో కీలకంగా మారాయి. ఈ సినిమాలో అధీరాగా సంజయ్ దత్ నటించగా రమికా సేన్ గా రవీనా టాండన్, ఇనాయత్ ఖలీల్ గా బాలకృష్ణ నటించారు. అలా 'KGF Chapter 1' లో కొన్ని ముఖాలను కనిపించకుండా సీక్రెట్ గా ఉంచగా వాటిని ఈ రెండో భాగంలో వదిలారు. అందులో దుబాయ్ డాన్ ఇనాయత్ ఖలీల్ పాత్ర ఒకటి.

బిగ్ బాస్ లో కూడా
చాలా ముఖ్యమైన ఈ పాత్ర కోసం నటుడు బాలకృష్ణను ఎంపిక చేసుకున్నారు. ఆయన నందమూరి బాలకృష్ణ అని అనుకున్నారు కానీ ఆయన తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు సంపాదించుకున్న ఆదర్శ్ బాలకృష్ణ తండ్రే. ఆదర్శ్ హ్యాపీ డేస్ వంటి సినిమాల్లో కనిపించడమే కాక బిగ్ బాస్ లో కూడా కనిపించాడు.

ప్రశాంత్ నీల్ కు అంకుల్
ఇక ఇనాయత్ ఖలీల్ పాత్ర సజీవంగా ఉంచడంతో ఆ పాత్ర మూడో భాగంలో కూడా ఉంచే అవకాశం కనిపిస్తోంది. ఇక ఆ సంగతి పక్కన పెడితే ఆయన ప్రశాంత్ నీల్ కు బంధువు కూడా. ప్రశాంత్ నీల్ కు ఆదర్శ్ బాలకృష్ణ కజిన్ అవుతారు. అలాగే బాలకృష్ణ ప్రశాంత్ నీల్ కు అంకుల్ అవుతారు.


Click it and Unblock the Notifications











