మృణాల్ థాకూర్‌కు ఎంగేజ్మెంట్ రింగ్.. పంపింది ఎవరో తెలుసా?

స్టార్ హీరోయిన్ మృణాల్ అడిగి మరీ సెటైర్ వేయించుకుంది బాలీవుడ్ స్టార్ హోస్ట్ తన్మయి భట్ తో. ఆయన ఏకంగా నిన్ననే కదా నీకు రింగ్ పంపించాను అంటూ అసలు విషయం బయట పెట్టడంతో షాక్ అవ్వడం మృణాల్ వంతయ్యింది. ఇంతకీ వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో మనం కూడా ఓ లుక్కేద్దాం పదండి.

సౌత్ లో చేసింది మూడు సినిమాలే అయినా స్టార్ హీరోయిన్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది మృణాల్. మొదటి సినిమా సీతారామంలో సీతగా నటించి అమాయకపు చూపుతో తెలుగు వాళ్ళందరి మదిలో మంచి స్థానాన్ని సొంతం చేసుకుంది ఈ బాలీవుడ్ బ్యూటీ.

Do You know Mrunal Thakur gets Engagement Ring Guess who send the Gift to Sita Ramam Heroine

ఆ తరువాత హాయ్ నాన్న అంటూ నానితో కలిసి పలరించింది. ఈ సినిమాలో కూడా క్యూట్ క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. కానీ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ తో ఫ్లాప్ అందుకుని హ్యాట్రిక్ హిట్ కొట్టడంలో ఫెయిల్ అయ్యింది.

ఈ నేపథ్యంలోనే తెలుగులో మృణాల్ నెక్ట్స్ మూవీ ఏంటి అనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో పలు సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు తాజాగా సోషల్ మీడియాలో అడిగి మరీ తనపై పంచ్ వేయించుకోవడం హాట్ టాపిక్ గా మారింది.

సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే మృణాల్ బాలీవుడ్ హోస్ట్ తన్మయి భట్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ కు రిప్లై ఇచ్చింది. తన్మయి ఓ ఈవెంట్ కు సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ ఇక్కడ వీళ్లను నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. మరి నా లైఫ్ పార్టనర్ ను ఎవరు పరిచయం చేస్తారు? అంటూ ఫన్నీగా రాసుకొచ్చాడు.

ఆ పోస్ట్ చూసిన మృణాల్ ఠాకూర్.. అమ్మాయి దొరికిందా? అంటూ క్యూరియాసిటీతో ప్రశ్నించింది. అతను వెంటనే రియాక్ట్ అవుతూ అవును నిన్ననే కదా నీకు రింగ్ పంపించాను అంటూ రిప్లై ఇచ్చాడు. అతను ఫన్నీగానే ఇలా రిప్లై ఇచ్చినప్పటికీ వీళ్లిద్దరి మధ్య జరిగిన ఈ ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ పై నెటిజన్ లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. కొంపదీసి మృణాల్ ఈ హోస్ట్ తో రిలేషన్షిప్ లో లేదు కదా అనే డౌట్ వ్యక్తం చేస్తున్నారు.

Do You know Mrunal Thakur gets Engagement Ring Guess who send the Gift to Sita Ramam Heroine

కానీ ఆమె అభిమానులు మాత్రం దీన్ని ఒక ఫన్నీ ఇన్సిడెంట్ గానే కొట్టి పడేస్తున్నారు. ఇక రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూలో మృణాల్ పెళ్లి కాకుండానే పిల్లల్ని కనడానికి రెడీ అని చెప్పి సంచలనం సృష్టించింది.

అంతేకాదు ఇంటిమేట్ సీన్ల కారణంగా నో చెప్పి పలు బిగ్ ప్రాజెక్టుల ఆఫర్లను వదులుకున్నాను అని చెప్పి మళ్ళీ వార్తల్లో నిలిచింది. తల్లిదండ్రులకు నచ్చజెప్పి ఇప్పుడిప్పుడే అలాంటి సీన్స్ ఉన్న సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాను అంటూ తనకు పెద్ద సినిమాల్లో అవకాశాలు ఎందుకు రావట్లేదో వెల్లడించింది.

కాగా మృణాల్ ఠాకూర్ హను రాఘవపూడి, ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది అంటూ గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నారు. మరి ఆమె నిజంగానే ఆమెకు ఛాన్స్ వచ్చిందా? అనేది తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X