Pawan Kalyan ఫ్యాన్స్‌కు పండుగే పండుగ.. OG టీజర్ నిడివి ఎంతో తెలుసా? పవర్‌స్టార్ పాత్ర పేరుతోనే టైటిల్ ఫిక్స్!

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్‌లో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రం OG. అయితే ఈ సినిమా కొద్ది రోజులపాటు షూటింగ్ పూర్తి చేసుకొని మీడియాలో సందడి చేసింది. సుజిత్ దర్శకత్వంలో స్టైలిష్‌గా రూపొందుతున్న ఈ సినిమాను They Calling him OG అంటూ ట్యాగ్‌లైన్‌ను ట్రెండ్ చేశారు. అయితే పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్, టీజర్‌ను రిలీజ్ చేస్తున్నట్టు సినిమా యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఈ సినిమా వివరాల్లోకి వెళితే..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2వ తేదీ. ఈ రోజున పవర్ స్టార్ అభిమానులకు పండుగ వాతావారణాన్ని కల్పించేందుకు OG చిత్ర యూనిట్ సిద్దమైంది. సెప్టెంబర్ 2వ తేదీన ఈ సినిమా టైటిల్‌ను కూడా ప్రకటించేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. అలాగే టైటిల్ ప్రకటనతోపాటు టీజర్‌ను కూడా దర్శకుడు సుజిత్ రెడీ చేసినట్టు సమాచారం.

 Pawan Kalyans OG teaser

పవన్ కల్యాణ్ నటిస్తున్న OG మూవీ టీజర్ కోసం భారీ కసరత్తే జరుగుతున్నది. ఈ సినిమా టీజర్ కోసం మలయాళ, తమిళ నటుడు అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ ఇస్తున్నట్టు యూనిట్ ఓ వార్తను లీక్ చేసింది. అయితే ఈ టీజర్‌లో అర్జున్ దాస్ వాయిస్ ప్రత్యేక ఆకర్షణగా మారనున్నదనేది సమాచారం.

They Calling him OG (OG) మూవీ టీజర్ నిడివి ఎక్కువగానే ఉన్నట్టు సమాచారం. ఈ సినిమా నిడివి సుమారు 72 సెకన్లు అని బయటకు ఓ వార్త పొక్కింది. ఈ టీజర్‌లో పవన్ కల్యాణ్ ఒరిజినల్ లుక్‌ను రిలీజ్ చేయనున్నారు. పవన్ కల్యాణ్ పుట్టిన రోజున అభిమానులకు ఈ విషయం మంచి పండుగలా మారడం ఖాయంగా కనిపిస్తున్నది.

 Pawan Kalyans OG teaser

అయితే OG సినిమా టైటిల్ విషయంలో రకరకాల పేర్లు బయటకు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో OG అంటే.. ఇప్పటి వరకు ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. కానీ ఈ సినిమాలో పవన్ పాత్ర పేరు ఓజాసా గంభీర్. OG అంటే ఓజాసా గంభీర్ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు ఓ వార్త మీడియాలో ప్రచారం అవుతున్నది.

 Pawan Kalyans OG teaser

ఇక OG మూవీకి సంబంధించిన మరో షెడ్యూల్ సెప్టెంబర్ 5వ తేదీన నుంచి ప్రారంభం కానున్నది. ఈ సినిమాను ఎన్నికలకు ముందు గానీ.. ఎన్నికల తర్వాత గానీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అనుకొన్నది అనుకొన్నట్టు జరిగితే ఈ సినిమా సంక్రాంతి రేసులో దిగనున్నది. జూన్ 12న గానీ, 13వ తేదీన గానీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X