ప్రశాంత్ నీల్ సోదరుడు ఏపీలో ఓ పెద్ద పొలిటికల్ లీడర్... అతనెవరో తెలుసా?

కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా కన్నడ చిత్ర పరిశ్రమ సత్తా చాటిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో రాబోతున్న సినిమాల సినిమాల కోసం యావత్ దేశం ఎదురు చూస్తోంది. ఇంతటి పాన్ ఇండియా స్టార్ డమ్ ఉన్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సోదరుడు ఆంధ్రాలో పెద్ద రాజకీయ నాయకుడు అన్న విషయం తెలుసా? ఆయనెవరో ఓ లుక్కేద్దాం పదండి.

శాండల్‌వుడ్ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఉగ్రం సినిమాతో కన్నడ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. యష్‌ తో కేజీఎఫ్ సినిమా తీసి పాన్ ఇండియా డైరెక్టర్‌గా వెలిగిపోతున్నాడు. కేజీఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన తర్వాత ప్రశాంత్ నీల్ రేంజ్ మారిపోయింది. ఆ తరువాత టాలీవుడ్ కి జంప్ అయిన ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ అనే మరో పాన్ ఇండియా సినిమా చేసాడు.

Do you know Prashanth Neel have Relation with AP Congress leader Raghu Veera Reddy

అప్పటిదాకా వరుస డిజాస్టర్ లతో సతమతం అవుతున్న ప్రభాస్ కు సలార్ తో ఊరనిచ్చాడు. అంతేకాకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం ప్రశాంత్ సలార్ 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆయనకి డైరెక్టర్ గా టాలీవుడ్‌లో మంచి డిమాండ్ ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు సలార్ 2 సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొత్త అప్‌డేట్ కూడా బయటకు వచ్చింది. సినిమా షూటింగ్ కూడా ఆగస్ట్‌లో ప్రారంభం కానుందని తెలుస్తోంది.

అయితే ప్రశాంత్ నీలకంఠపురం 1980 జూన్ 4న తెలుగు కుటుంబంలో జన్మించాడు. ఆంధ్రప్రదేశ్‌లోని మడకశిర సమీపంలోని నీలకంఠపురం గ్రామానికి చెందిన సుభాష్ రెడ్డి, భారతి దంపతుల కుమారుడు ప్రశాంత్ నీల్. ఆయన తండ్రి సుభాష్ రెడ్డి బెంగళూరులో స్థిరపడ్డారు. అందుకే ప్రశాంత్ తెలుగు ప్రేక్షకులకు కన్నడ డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు.

Do you know Prashanth Neel have Relation with AP Congress leader Raghu Veera Reddy

ప్రశాంత్ నీల్ కి మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరా రెడ్డి స్వయానా అన్న అనే విషయం చాలామందికి తెలియదు. రఘవీరా రెడ్డి తండ్రి ప్రశాంత్ నీల్ తండ్రి సోదరులట. ప్రశాంత్ నీల్ తండ్రి సుభాష్ చాలా ఏళ్ల క్రితం బెంగళూరులో స్థిరపడ్డారు. అయినప్పటికీ వీలైనప్పుడల్లా సత్యసాయి జిల్లా మడకశిర నీలకంఠపూర్‌కు సుభాష్‌, ప్రశాంత్‌ నీల్‌ కలిసి వచ్చేవారు.

నీలకంఠపూర్ అన ఊరి పేరును ఇంటి పేరుగా మార్చుకున్నాడు ప్రశాంత్ నీల్. గతంలో నీలకంఠపూర్‌లో ఎల్‌వీ ప్రసాద్‌ నేత్రవైద్యశాల నిర్మాణానికి రూ. 50 లక్షల విరాళాన్ని ప్రకటించారు ఈ డైరెక్టర్. కాగా కేజీఎఫ్ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ కి టాలీవుడ్ లో అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో రాబోతున్న మూడు సినిమాలు సలార్ 2, ఎన్టీఆర్ మూవీ, కేజీఎఫ్ 3 సినిమాల గురించే అందరూ ఎదురు చూస్తున్నారు. ఇందులో ముందుగా రాబోయేది మాత్రం సలార్ 2నే.

More from Filmibeat

Read more about: prashanth neel raghuveera reddy
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X