సింగర్ గీతామాధురి ఇంట ఘనంగా బారసాల.. కొడుక్కి NTR పేరు వచ్చేలా పెట్టుకున్న నందు!
టాలీవుడ్ టాప్ సింగర్ గా కొనసాగుతున్న గీతా మాధురి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటుడు నందును ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మకు ఇప్పటికీ ఓ కూతురు ఉంది. అయితే తాజాగా ఈ జంటకు ఓ బాబు పుట్టాడు. తాజాగా ఆ బాబుకు ఘనంగా బారసాల నిర్వహించారు. ముఖ్యంగా ఈ వేడుకల్లో గీతా, నందులు అచ్చమైన తెలుగు వాళ్లులా కనిపించి మెస్మరైజ్ చేశారు. ముఖ్యంగా కొడుకుకు ఎన్టీఆర్ పేరు వచ్చేలా పేరు పెట్టుకున్నారు. దీంతో వాళ్ల బాబు పేరు వైరల్ గా మారింది. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
సింగర్ గీతా మాధురి తెలుగులో అనేక సినిమాలకు పాటలు పాడింది. తన శ్రావ్యమైన గొంతుతో అద్భుతమైన పాటలు పాడి అతి తక్కువ కాలంలోనే స్టార్ సింగర్ గా మారింది. అన్ని రకాల పాటలు పాడుతూ కుర్రకారును ఉర్రూతలూగించిన ఈ ముద్దుగుమ్మకు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. తన కెరియర్ బాగా సాగుతున్న సమయంలోనే ఈ క్యూట్ బ్యూటీ నటుడు నందును ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆయన కూడా అనేక సినిమాల్లో నటిస్తూ బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన ఢీ జోడికి యాంకర్ గా కూడా వ్యవహరిస్తున్నారు.

ప్రేమలో ఉన్న ఈ క్యూట్ కపల్.. పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. ముఖ్యంగా 2014లో వీరి పెళ్లి జరిగింది. ఆ తర్వాత నుంచి వీరు చాలా అన్యోన్యంగా ఉంటూ.. తమకు సంబంధించిన విషయాలను ఇరువరూ తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఎప్పటికప్పుడు వెల్లడించేవారు. తమ పర్సనల్ లైఫ్ లతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ లకు సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకునే వారు. వీరి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా 2019లో గీతా మాధురి పండంటి ఆడబిడ్డకు జన్మను ఇచ్చింది.
తమ గారాలపట్టికి ఈ జంట.. దాక్షాయణి ప్రకృతి అనే పేరును పెట్టుకుంది. చాలా పద్ధతిగా అనిపిస్తున్న ఈ పేరు పెట్టుకుని అందరి మనసులు ఆకర్షించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ రెండోసారి గర్భం దాల్చి పండంటి మగ బిడ్డకు జన్మను ఇచ్చింది. తాజాగా ఆ బాబుకు ఘనంగా బారసాల నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియా వేధికగా షేర్ చేయగా నెట్టింట వైరల్ గా మారాయి. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ కొడుక్కు పెట్టిన పేరు వైరల్ గా మారింది.

సింగర్ గీతా మాధురి, నందులు తమ కొడుకుకు.. ధృవదీర తారక్ అని పేరు పెట్టుకున్నారు. తారక్ అని రావడంతో.. ఎన్టీఆర్ పేరును కొడుక్కు పెట్టుకున్న సింగర్ అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే కావాలనే ఎన్టీఆర్ పేరును అలా పెట్టుకున్నారా లేక తమకు నచ్చిన పేరును మాత్రమే పెట్టుకున్నారా అనేది తెలియాలంటే మాత్రం.. ఈ జంటలో ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సిందే.


Click it and Unblock the Notifications











